Edible Oils | న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశీయ వంటనూనెల దిగుమతులు ఈ ఏడాది ఆగస్టులో 33 శాతం ఎగిశాయి. ఏకంగా 18.52 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. నిరుడు ఆగస్టు నుంచి ఈ స్థాయిలో నెలవారీ దిగుమతులు లేకపోవడం గమనార్హం. ఇక ఆహారేతర విజిటబుల్ ఆయిల్స్‌తో కలిపి చూస్తే ఈ ఆగస్టు దిగుమతులు 18.66 లక్షల టన్నులుగా ఉన్నాయి.
అయితే దేశీయ మార్కెట్లో వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని, దిగుమతి సుంకాలు కూడా తక్కువయ్యాయని, దీంతో ఆయా దేశాల నుంచి భారత్‌కు దిగుమతులు పెరిగిపోయాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) తెలిపింది. కాగా, ఈసారి ఆగస్టు దిగుమతుల్లో పామాయిల్ వాటానే 11.28 లక్షల టన్నులుగా ఉన్నది. రకరకాల విత్తనాలు, పండ్లు, గింజల నుంచి తీసే నూనెలనే వెజిటబుల్ ఆయిల్స్ అంటున్నది తెలిసిందే.