Crude Oil | రష్యా నుంచి వరుసగా మూడో నెలలో క్రూడాయిల్ దిగుమతులు తగ్గాయి. గత నెల క్రూడాయిల్ దిగుమతి ఏడు నెలల కనిష్ట స్థాయికి తగ్గింది. ఆగస్టులో ప్రతి రోజూ 1.46 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ దిగుమతి చేసుకున్న భారత్.. జూలైలో 1.91 మిలియన్ బ్యారెళ్లు దిగుమతి చేసుకున్నది.
ఇరాక్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు క్రూడాయిల్ దిగుమతులు తగ్గించుకున్నాయి. జూలైలో 8.91 లక్షల బ్యారెళ్ల ముడి చమురు దిగిమతైతే.. ఆగస్టులో 8.66 లక్షల బ్యారెళ్లకు పడిపోయింది. కానీ సౌదీ అరేబియా నుంచి ప్రతి రోజూ 4.84 లక్షల బ్యారెళ్ల నుంచి 8.20 లక్షల బ్యారెళ్ల క్రూడ్ దిగుమతి పెరిగింది.. అంటే దాదాపు రెట్టింపు క్రూడాయిల్ సౌదీ అరేబియా నుంచి పెరిగింది.
గతేడాది ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా, ఈయూ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఇతర దేశాలకు రష్యా చౌక ధరకే క్రూడాయిల్ విక్రయించడం మొదలు పెట్టింది. భారత్ కూడా పెద్ద మొత్తంలో రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకుంది.
మే నెలలో గరిష్టంగా రోజుకు 20 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ దిగుమతి కాగా, వర్షాకాలంలో గిరాకీ తగ్గిపోయింది. క్రమంగా రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి తగ్గిపోవడానికి కారణంగా తెలుస్తు్న్నది. జూలైతో పోలిస్తే గత నెలలో భారత్ క్రూడాయిల్ దిగుమతి ఏడు శాతం తగ్గింది. ఆగస్టులో ప్రతిరోజూ 43.5 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ భారత్ దిగుమతి చేసుకుంది.