AI | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : టెక్నాలజీ రంగంలో రోజుకొక వినూత్న మార్పులు జరుగుతుంటాయి. ఇటీవలకాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన కృత్రిమ మేధస్సు(ఏఐ) టెక్నాలజీ వాడకంలో భారతీయులు ముందువరుసలో నిలిచారు. దేశ జనాభాలో సగం కంటే అత్యధిక మంది ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారని మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ దేశాల్లో వినియోగిస్తున్నవారికంటే ఇది రెండింతలు అధికంగా 65 శాతం మంది ఇండియన్స్ ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారని మంగళవారం మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ సర్వేలో ఈ విష యం వెల్లడైంది. జూలై 19 నుంచి ఆగస్టు 9, 2024 మధ్యకాలంలో భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 15 వేల మంది యువతియువకు లు, పెద్దలు పాల్గొన్నారు. వీరిలో 65 శాతం మంది ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నామ ని, 2023 కంటే ఇది 26 శాతం అధికమని పేర్కొంది.
అంతర్జాతీయ దేశాల్లో సరాసరిగా 31 శాతం మంది ఈ టెక్నాలజీని వాడుతున్నారు. ముఖ్యంగా దేశీయంగా ఈ టెక్నాలజీని అనువాదాలకు, ప్రశ్నల జవాబులకోసం, మెరుగైన పనితీరు కనబర్చడానికి, స్కూల్వర్క్లో విద్యార్థులకు సహాయం అందించడానికి వినియోగిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ వాడకంలో మిలియనీర్లు(25 నుం చి 44 ఏండ్లలోపువారు) 84 శాతం మంది ఉన్నారని పేర్కొంది.
డిజిటల్ చాలెంజ్‌పై తల్లిదండ్రులకంటే తమ పిల్లలకు అవగాహణ అధికంగా ఉన్నదని, గడిచిన కొన్నేండ్లుగా ఇది మరింత పెరుగుతున్నదని తెలిపింది. అయినప్పటికీ అంతర్జాతీయ ట్రెండ్లను ప్రతిబింబించేలా ఆన్లైన్ దుర్వినియోగం, డీప్ ఫేక్‌లు, స్కామ్‌లపై ఈ నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది. 18 ఏండ్ల కంటే తక్కువ వయస్సు కలిగిన యువకులు ఏఐ టెక్నాలజీని విపరీతంగా వాడేస్తున్నారని తెలిపింది.