Stock Market | వరుసగా మూడో సెషన్లో స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 25,900 పాయింట్లు దాటింది. రియాలిటీ మినహా అన్నిరంగాల్లో కొనుగోళ్లు జరిగాయి. ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలతో మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. బిహార్ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే స్పష్టమైన విజయం సాధిస్తుందన్న అంచనాలు.. భారత్-యూఎస్ వాణిజ్య చర్చల్లో పురోగతితో పాటు భారత్‌పై సుంకాలను తగ్గిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలతో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 84,238.86 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 84,166.75 కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. అత్యధికంగా 84,652.01 పాయింట్లకు పెరిగింది.
చివరకు 595.19 పాయింట్లు పెరిగి 84,466.51 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 180.85 పాయింట్లు పెరిగి 25,875.80 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ తాజా 52 వారాల గరిష్ట స్థాయి 61,011ని తాకింది, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం పెరిగింది. నిఫ్టీలో ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ అత్యధికంగా లాభపడ్డాయి. ఇక టాటా స్టీల్, టీఎంపీవీ, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి. రియల్టీ మినహా, మిగతా అన్ని రంగాల సూచీలు మీడియా, ఆటో, టెలికాం, ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఒకటి నుంచి రెండుశాతం వరకు పెరిగాయి. క్యూ2 లాభం 61శాతం పెరిగిన తర్వాత బీఎస్ఈలో షేర్లు 5శాతం.. ఆటోడెస్క్‌తో భాగస్వామ్యంతో ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ షేర్లు 1.5శాతం వృద్ధి చెందాయి.
ఆవాస్ ఫైనాన్షియర్స్ షేర్లు 5శాతం, క్యూ 2 లాభం 48శాతం, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ షేర్ ధర 5శాతం పెరగ్గా.. లాభాలు తగ్గిన తర్వాత థర్మాక్స్ షేర్ ధర 3శాతం తగ్గింది. జీఈ షిప్పింగ్, మాక్స్ ఫైనాన్షియల్, అదానీ పోర్ట్స్, కెనరా బ్యాంక్, టైటాన్ కంపెనీ, యూపీఎల్, అదానీ ఎనర్జీ, ఆల్కెమ్ ల్యాబ్, హిటాచి ఎనర్జీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆసియన్ పెయింట్స్, నాల్కో, భేల్, అసాహి ఇండియా, కెన్ ఫిన్ హోమ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌పీసీఎల్, ఐఓసీ, భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, ఇతర స్టాక్స్ బీఎస్ఈలో 52వారాల గరిష్ట స్థాయిని తాకాయి.