న్యూఢిల్లీ, జూలై 30: మరో విదేశీ సంస్థకు భారతీయుడు నాయకత్వం వహించబోతున్నారు. ఎయిర్ న్యూజిలాండ్ సీఈవోగా భారత సంతతికి చెందిన నిఖిల్ రవిశంకర్ నియమితులయ్యారు. ఈ నియామకం అక్టోబర్ 20 నుంచి అమలులోకి రానున్నది.
గడిచిన ఐదేండ్లుగా ఎయిర్లైన్స్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్గా విధులు నిర్వహించన ఆయనకు పదొన్నతి లభించినట్టు అయింది. ప్రసుత్తం సీఈవోగా విధులు నిర్వహిస్తున్న గ్రేగ్ ఫోరన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.