తిరిగి కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. 382 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్‌పడింది. ఐటీ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపర్లలో జోష్‌ను పెంచింది. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 382.50 పాయింట్లు అందుకొని 74,649.84 వద్ద ముగిసింది.
ముంబై, జూన్ 2 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్‌పడింది. ఐటీ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపర్లలో జోష్‌ను పెంచింది. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 382.50 పాయింట్లు అందుకొని 74,649.84 వద్ద ముగిసింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 100.95 పాయింట్లు ఎగబాకి 23,483.55 పాయింట్లకు చేరుకున్నది. ఐటీ రంగ షేర్లు నష్టపోవడం వల్లనే సూచీల్లో జోష్ అంతగా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.
కదం తొక్కిన ఐటీ షేర్లు
గత కొన్ని రోజులుగా పతనాన్ని నమోదు చేసుకుంటున్న ఐటీ రంగ షేర్లు తిరిగి కోలుకున్నాయి. హెక్సావేర్ టెక్నాలజీస్ అత్యధికంగా 6.99 శాతం లాభపడగా..టీసీఎస్ అత్యధికంగా 6.5 శాతం, ఇన్ఫోసిస్ 5.66 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీ 4.08 శాతం, టెక్ మహీంద్రా 1.76 శాతం, విప్రో 1.65 శాతం చొప్పున బలపడ్డాయి. ఐటీ ఇండెక్స్ సూచీ అత్యధికంగా 4.40 శాతం వృద్ధిని కనబరిచింది. ఐటీ కంపెనీల ఆశాజనక ఫలితాలకు తోడు యూఎస్ టెక్నాలజీ కంపెనీల గైడెన్స్ బాగున్నట్టు వచ్చిన వార్తలు మదుపర్లను ఐటీ షేర్లను కొనుగోలు చేయడానికి ఉత్సుకతను ప్రదర్శించాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
- టీసీఎస్ షేరు 6.53 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది.
- ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, అదానీ సిమెంట్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, విప్రో, టాటామోటర్స్, టైటాన్, ట్రెంట్, ఐటీసీ, జియోఫిన్, మ్యాక్స్‌హెల్త్, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్ వంటి షేర్లు ఒక్కశాతానికి పైగా లాభపడ్డాయి. వీటితోపాటు మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూస్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి షేర్లు లాభాల్లో ముగిశాయి.
- కానీ, ఎన్టీపీసీ షేరు 2.89 శాతం పడిపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్‌ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, సిప్లా, శ్రీరామ్ పైనాన్స్ షేర్లు నష్టపోయాయి.
- రంగాలవారీగా ఐటీ సూచీ అత్యధికంగా 4.40 శాతం బలపడగా, ఫోకస్డ్ ఐటీ 3.83 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.23 శాతం, సర్వీసెస్ 1.11 శాతం, టెలికమ్యూనికేషన్స్, ప్రైవేట్ బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, వాహన షేర్లు కదం తొక్కాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

