Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ప్లాట్‌గా ముగిశాయి. ఉదయం నష్టాల్లో మొదలైన సూచీలు.. పొద్దంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. మార్కెట్ మొదలయ్యాక కొద్దిసేపటికి మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. మళ్లీ మధ్యాహ్నం వరకు నష్టాల్లోకి జారుకున్నాయి. మళ్లి చివరి సెషన్లో కోలుకోవడంతో భారీ నష్టాల నుంచి బయటపడ్డాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 83,835.10 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 83,609.54 కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. 84,127 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది.
చివరకు 39.78 పాయింట్ల లాభంతో 83,978.49 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 41.25 పాయింట్లు పెరిగి 25,763.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్లో 2,144 షేర్లు లాభపడగా.. 1,896 షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పెరిగాయి. ఫార్మా, టెలికాం, రియాలిటీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు ఒకటి నుంచి రెండుశాతం పెరిగాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ, టాటా కన్స్యూమర్ నిఫ్టీలో లాభాలను ఆర్జించాయి. మారుతి సుజుకి, ఐటీసీ, టీసీఎస్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎల్అండ్టీ నష్టపోయాయి.