గతేడాది 1,050 టన్నులు రాక
న్యూఢిల్లీ, జనవరి 4: బంగారానికి డిమాండ్ భారీగా పెరగడంతో 2021లో భారత్ రికార్డు స్థాయిలో దిగుమతి చేసుకొంది. ఈ దిగుమతుల కోసం గతేడాది 55.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4.2 లక్షల కోట్లు) విదేశీ మారకాన్ని ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. 2011లో 53.9 బిలియన్ డాలర్ల విలువగల బంగారం దిగుమతి అవగా, ఆ స్థాయిని మించి తాజాగా కొత్త రికార్డు నెలకొంది. 2020లో 22 బిలియన్ డాలర్ల దిగుమతుల య్యాయి. ఇక పరిమాణం రీత్యా 2021లో 1,050 టన్నుల బంగారం దిగుమతి కాగా, 2020లో 430 టన్నులే. నిరుడు పసిడి ధర అంతక్రితం ఏడాదికంటే తగ్గడం, 2020లో వాయిదాపడిన పెండ్లిళ్లు వరుసగా జరగడంతో భారీ డిమాం డ్ నెలకొందని జ్యువెల్లర్స్ చెప్తున్నారు. 2020 ఆగస్టులో దేశంలో రూ.56,19 1 రికార్డుస్థాయికి చేరిన తులం బంగారం ధర.. 2021 మార్చికల్లా రూ.43,320 కనిష్ఠ స్థాయికి తగ్గింది. ఆ నెలలో 177 టన్నుల బంగారం దిగుమతైంది. ఒకే నెలలో ఇంతగా పసిడి దిగుమతులు జరగడం అదే ప్రథమం. కాగా ముగిసిన డిసెంబర్లో 86 టన్నుల బంగారం దేశంలోకి వచ్చింది.