ఇండియన్ బ్యాంక్ లాభం 3,103 కోట్లు
ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.3,103 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,956 కోట్ల లాభంతో పోలిస్తే 5 శాతం వృద్ధిని కనబరిచింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 : ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.3,103 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,956 కోట్ల లాభంతో పోలిస్తే 5 శాతం వృద్ధిని కనబరిచింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో లాభాల్లో వృద్ధి నమోదైందని బ్యాంక్ ఎండీ, సీఈవో బినోద్ కుమార్ తెలిపారు.
సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.18,599 కోట్ల నుంచి రూ.19,980 కోట్లకు పెరిగినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకూ రూ.18.25 లేదా 182.50 శాతం డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 3.09 శాతం నుంచి 1.98 శాతానికి పడిపోగా, నికర ఎన్పీఏ కూడా 0.19 శాతం నుంచి 0.15 శాతానికి దిగొచ్చాయి. అయినప్పటికీ మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.748 కోట్ల నిధులను వెచ్చించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

