న్యూఢిల్లీ, జూలై 10: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,273 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ఇండియన్ బ్యాంక్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.2,973 కోట్ల లాభంతో పోలిస్తే 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. బ్యాంక్ ఆదాయం రూ.18,721 కోట్ల నుంచి రూ.20,724 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.86 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 0.15 శాతానికి దిగొచ్చాయి. ఇదే సమయంలో మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.376 కోట్ల నిధులను వెచ్చించింది.