చెన్నై, జూలై 2: కనీస నగదు నిల్వలు లేని పొదుపు ఖాతాలపై విధించే జరిమానాలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఈ నిర్ణయం ఈ నెల 7 నుంచి అమలులోకి రానున్నట్టు పేర్కొంది.
ఆర్థిక సేవలను మరింత విస్తరించడానికి, సమాజంలో అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు బ్యాంక్ ఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 9 శాతానికి దిగొచ్చింది.