e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home News చైనా.. అమెరికాను భార‌త్ దాటుతుందా.. ముకేశ్ అంబానీ ఏం చెప్పారు?

చైనా.. అమెరికాను భార‌త్ దాటుతుందా.. ముకేశ్ అంబానీ ఏం చెప్పారు?

న్యూఢిల్లీ: వ‌చ్చే 30 ఏండ్ల‌లో అమెరికా, చైనాల కంటే భార‌త్ సంప‌న్న దేశంగా ఆవిర్భవిస్తుంద‌ని ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 30 ఏండ్ల క్రితం చేప‌ట్టిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల ఫలాలు అసామాన్య‌మైన‌వ‌ని వ్యాఖ్యానించారు.

స‌మాజంలోని దిగువ వ‌ర్గాల్లో సంప‌ద స్రుష్టించ‌డం భార‌త్ త‌ర‌హా అభివ్రుద్ధికి త‌ప్ప‌నిస‌రి అని పేర్కొన్నారు. ఏది ఏమైనా 2047 నాటికి అమెరికా, చైనాల‌ను దాటి భార‌త్ సంప‌న్న దేశంగా ఆవిర్భ‌విస్తుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.

- Advertisement -

దేశంలో ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టి 30 ఏండ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ… టైమ్స్ ఆఫ్ ఇండియా లో వ్యాసం రాశారు.

1991లో ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టే నాటికి జీడీపీ 266 బిలియ‌న్ల డాల‌ర్ల‌యితే, ఈ నాడు అది ప‌ది రెట్లు పెరిగింద‌న్నారు. ఇది సాహ‌సోపేత‌మైన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల వ‌ల్లే సాధ్య‌మైంద‌ని వ్యాఖ్యానించారు.

1991లో ద్ర‌వ్య‌లోటును ఎదుర్కొంటున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్ ఉంద‌ని పేర్కొన్నారు. 2021 నాటికి అద‌న‌పు ఆదాయం గ‌ల ఎకాన‌మీగా రూపుదిద్దుకున్న‌ద‌ని వ్యాఖ్యానించారు. 2051 నాటికి అద‌న‌పు ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా రూపొంద‌డంతోపాటు ప్ర‌తి ఒక్క‌రికి స‌మాన స్థాయిలో సంప‌ద స‌మ‌కూరుతుంద‌ని పేర్కొన్నారు.

1991లో నాటి అధినేత‌లు చూపిన విజ‌న్‌, ధైర్య సాహ‌సాలు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ డైరెక్ష‌న్‌, సంక‌ల్పాన్ని మార్చేశాయ‌ని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.

జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో కేంద్ర ప్ర‌భుత్వం ప్రైవేట్ రంగాన్ని స్ఫూర్తిదాయ‌కంగా నిలిపింద‌న్నారు. లైసెన్స్ రాజ్‌కు స్వ‌స్తి ప‌లికి, స‌ర‌ళీక్రుత ఆర్థిక విధానాలు అమ‌లులోకి తెచ్చార‌ని కొనియాడారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana