న్యూఢిల్లీ, మే 21: గత నెలలో దేశీయంగా 1.43 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే నెలలో ప్రయాణించిన వారితో పోలిస్తే 8.45 శాతం చొప్పున పెరిగారని డీజీసీఏ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
విమానయాన రంగంలో 64.1 శాతం మార్కెట్ వాటాతో ఇండిగో తొలిస్థానంలో నిలువగా, ఎయిర్ ఇండియా గ్రూపు 27.2 శాతంతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. అలాగే ఆకాశ ఎయిర్ 5 శాతం, స్పైస్‌జెట్ 2.6 శాతం మార్కెట్ వాటా కలిగివున్నాయని పేర్కొంది. అలాగే ఈ ఏడాది తొలి నాలుగు నెలలు(జనవరి-ఏప్రిల్ మధ్యకాలంలో) 5.73 కోట్ల మంది విమాన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారని తెలిపింది.