న్యూఢిల్లీ, అక్టోబర్ 16: బంగారం ధర లు మరో మైలురాయికి చేరువయ్యాయి. దేశీయం గా పండుగ సీజన్ కావడంతో ఆభరణాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు కూడా భారీగాపుంజుకోవడంతో దేశీయంగా ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో తులం పుత్తడి ధర రూ.79 వేలకు చేరువైంది. బులియన్ మార్కెట్లో పదిగ్రాముల ధర రూ.250 అధికమై రూ.78,900కి చేరుకున్నట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. అంతకుముందు రోజు ధర రూ. 78,650గా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో వెండి మరో వెయ్యి రూపాయలు ఎగబాకింది. కిలో వెండి రూ.1,0 00 ఎగిసి రూ.92,500 నుంచి రూ.93,500కి చేరుకున్నది. హైదరాబాద్లో 24 క్యారెట్ తులం గోల్డ్ ధర రూ.490 అధికమై రూ.77,890కి చేరుకోగా, 22 క్యారెట్ ధర రూ.450 ఎగబాకి రూ.71,400 పలికింది. కిలో వెండి మాత్రం రూ.100 దిగి రూ.1,02,900గా నమోదైంది. ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడం వీటి ధరలు పెరగడానికి ప్రధాన కారణమని ఆభరణాల వర్తకులు వెల్లడించారు. గ్లోబల్ మార్కె ట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,675 డాలర్లు పలుకగా, వెండి 32.05 డాలర్లుగా ఉన్నది.