Home Loan | హోమ్ లోన్ తీసుకున్నాక మరణిస్తే.. ఆ అప్పు ఎవరు కట్టాలి?
Home Loan Insurance | కరోనా వైరస్.. ఊహించని విధంగా ప్రపంచంపై విరుచుకుపడిన ఈ మహమ్మారి వల్ల మానవ జాతికి పెద్ద ప్రమాదమే ఏర్పడింది. భారత్‌లోనూ కొవిడ్ పెను నష్టాన్నే సృష్టించగా, చాలా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు సంక్షోభంలో పడ్డాయి. ముఖ్యంగా కుటుంబ పెద్దలను కోల్పోయిన సంఘటనలు, కుటుంబం మొత్తంగా మరణించిన సందర్భాలు అనేకం. అయితే కుటుంబ పెద్ద తీసుకున్న రుణాలు మరణించిన తర్వాత ఆ కుటుంబానికి తలకు మించిన భారమే. గృహ రుణం వంటి దీర్ఘకాల లోన్లు చెల్లించడం కష్టమే. మిగతా రుణాల సంగతి ఎలా ఉన్నా..హోమ్ లోన్‌ను మాత్రం మృతుని చట్టబద్ధ వారసులు చెల్లించాల్సిందే మరి.

కరోనా మహమ్మారి.. అంచనాలను తలకిందులు చేస్తూ అందరి జీవితాల్ని చిదిమేస్తున్నది. మునుపెన్నడూ లేని భయోత్పాతాన్ని సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. అన్ని వర్గాల ఆర్థిక లక్ష్యాలనూ కుప్పకూలుస్తున్నది. ప్రధానంగా భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో సొంతింటి కల సాకారం కోసం శ్రమిస్తున్న ఎందరినో కరోనా పెద్ద చిక్కుల్లోనే పడేసింది. గృహ రుణాలపై ఇండ్లు కొనుక్కున్నవారు దురదృష్టవశాత్తు మరణిస్తే.. ఏం చేయాలో తెలియని దుర్భర పరిస్థితుల్లో ఇప్పుడు అనేక కుటుంబాలు ఉన్నాయంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి వారికి నిపుణులు ఏం సలహాలు ఇస్తున్నారో తెలుసుకుందాం.
బీమా ఉందా?
గృహ రుణం తీసుకున్న వ్యక్తి అకాల మరణం పాలైతే.. ఆ రుణానికి ఇన్సూరెన్స్ ఉందో?.. లేదో? పరిశీలించండి. హోమ్ లోన్ ఇచ్చిన సంస్థనే సంప్రదించండి. నిజానికి ఈ దీర్ఘకాల రుణాలపై హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు బీమాను తప్పనిసరి చేశాయి. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నరగా తీసుకుంటున్న రుణాలన్నింటిపైనా బీమాను తప్పనిసరిగా అమలు చేస్తున్నాయి. ఒకవేళ హోమ్ లోన్‌కు బీమా ఉన్నట్టయితే మరణించిన వ్యక్తి తీసుకున్న రుణాన్ని బీమా సంస్థనే చెల్లిస్తుంది.
పాలసీలు ఇలా..
హౌజింగ్ లోన్ కంపెనీలు రెడ్యూసింగ్ బ్యాలన్స్ ప్లాన్, లెవల్ కవర్ ప్లాన్లను అందిస్తున్నాయి. మొదటిదానిలో రుణ గ్రహీత చనిపోతే బాకీని బీమా కంపెనీనే చెల్లిస్తుంది. రెండో ప్లాన్‌లో రూ.20 లక్షల గృహ రుణానికి రూ.20 లక్షల బీమా తీసుకున్నట్లయితే రుణగ్రహీత చనిపోయినప్పుడు అప్పటిదాకా చెల్లించిన మొత్తాన్ని మినహాయించి హౌజింగ్ లోన్ కంపెనీకి బాకీని బీమా సంస్థ చెల్లిస్తుంది. అలా చెల్లించిన తర్వాత మిగిలిన బీమా మొత్తాన్ని వారసులకు అందజేస్తారు.
క్లయిమ్‌ను నిరాకరిస్తే?
బీమా తీసుకునే సమయానికి ముందున్న ఆరోగ్య సమస్యలను తెలియ చేయలేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ హౌజింగ్ లోన్‌పై ఉన్న బీమా క్లయిమ్‌ను నిరాకరించవచ్చు. అందుకే ఏ బీమాను తీసుకున్నా సరే ముందుగా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని నిస్సంకోచంగా తెలపాల్సిందే. సాధారణంగా యాక్సిడెంట్, లేదా సహజ మరణాల విషయంలో ఎలాంటి పేచి ఉండదు. హౌజింగ్లోన్ పెద్ద మొత్తాలలో తీసుకుంటాం కనుక కంపెనీలు ఈఎంఐలలో భాగంగానే ఇన్సూరెన్స్ ప్రీమియంను కూడా కలిపేస్తాయి. ప్రస్తుతం తక్కువ వడ్డీరేట్ల కోసం హోమ్ లోన్‌ను వేరే కంపెనీకి పోర్ట్ చేస్తున్నారు. అయితే రుణం వేరే కంపెనీకి బదిలీ అయినంత మాత్రాన బీమా బదిలీ అవదు. రుణాన్ని వేరే కంపెనీకి బదలాయించేటప్పుడు ఈ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. హౌజింగ్ లోన్ కాలపరిమితితోపాటే బీమా పాలసీకి కూడా కాలపరిమితి ఉంటుంది.
బీమా లేకపోతే..
హోమ్ లోన్ ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే.. ఆ రుణాన్ని చెల్లించాల్సిన బాధ్యత పూర్తిగా సహ రుణ గ్రహీత లేదా చట్టబద్ద వారసులదే. ఈఎంఐల చెల్లింపునకు వీరితోపాటు రుణానికి గ్యారంటి ఇచ్చిన వారిని కూడా సంప్రదించవచ్చు. ఈ పరిస్థితుల్లో రుణాన్ని చెల్లించేందుకు సంబంధిత వారసులు లేదా సహ రుణ గ్రహీత వెసులుబాట్లను కోరవచ్చు. దాదాపు ఆరు నెలల పాటు మారటోరియంను కూడా పొందవచ్చు. ఒకవేళ మారటోరియం గడువు తర్వాత కూడా చెల్లించలేకపోతే నోటీసులు జారీచేసి ఆ ఇంటిని గృహ రుణ సంస్థ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. దానికన్నా ముందు ఆ రుణాన్ని మొండి బకాయి (నిరర్థక ఆస్తి లేదా ఎన్పీఏ)గా ప్రకటిస్తారు. ఆపై వేలం వేసి రుణ వసూలుకు ప్రయత్నిస్తారు. వచ్చిన మొత్తంలో బకాయి వసూలు పోగా.. మిగిలితే సంబంధిత వారసులకే ఆ మొత్తాన్నీ ఇస్తారు. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే హౌజింగ్ లోన్తోపాటే బీమానూ తీసుకోవాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Home Loans without Banks | బ్యాంకుతో పనిలేకుండానే హోంలోన్ కావాలా.. అదీ రూ.50 లక్షల వరకు..
Home Loan | సొంతిల్లు కొనుక్కుంటారా.. ఐటీ చెల్లించకున్నా వీళ్లకు లోన్ వచ్చేస్తుంది
Home loan Vs Plot loan| ఇంటిపై లోన్ తీసుకోవడం బెటరా.. ఇంటి స్థలంపైనా ? ఏది బెస్ట్ ?
Home loan | గృహ రుణం తీరిపోయిందా.. నెక్ట్స్?
Home loan | ఇంటి రుణ భారం తగ్గించుకోవాలంటే.. ఇవీ ఆప్షన్లు!!
Home loan | ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
వడ్డీ రేటు తగ్గుతుందని హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- banks
- finance
- home loan
- home loans
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

