Home loan Vs Plot loan| ఇంటిపై లోన్ తీసుకోవడం బెటరా.. ఇంటి స్థలంపైనా ? ఏది బెస్ట్ ?
Home or Plot| ఇల్లు, ఇండ్ల స్థలం రెండూ ఆస్తి కొనుగోలు కిందకే వస్తాయి. అయితే ఇల్లు, ఇండ్ల స్థలం కొనుగోలు చేయడానికి తీసుకునే రుణంలో తేడాలు....

న్యూఢిల్లీ: కొత్త ఇల్లు కొనుక్కోవడం ప్రతి ఒక్కరి కల.. కొంత మంది ఇండ్ల స్థలం కొనుగోలు చేయడానికి కూడా ప్రాధాన్యం ఇస్తారు. ఇల్లు లేదా ఇండ్ల స్థలం కొనుగోలు చేయడం భిన్నంగా కనిపించకపోవచ్చు. ఇల్లు, ఇండ్ల స్థలం రెండూ ఆస్తి కొనుగోలు కిందకే వస్తాయి. అయితే ఇల్లు, ఇండ్ల స్థలం కొనుగోలు చేయడానికి తీసుకునే ( Home loan Vs Plot loan ) రుణంలో తేడాలు ఉన్నాయి.
ఆస్తి, ఇల్లు కొనుగోళ్లకు రుణాలు లభ్యం
ఆస్తి కొనుగోలులో భాగంగా హోంలోన్లు లభిస్తాయి. ఇప్పటికే కట్టి ఉన్న ఇండ్లు, నిర్మాణంలో ఉన్న ఇండ్లు, భవిష్యత్‌లో నిర్మించే ఇండ్లపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటి రుణాలిస్తాయి. ఇంటి నిర్మాణం లేదా పెట్టుబడుల కోసం ఆస్తి లేదా ఇండ్ల స్థలం కొనుగోలుపైనా రుణాలు లభిస్తాయి.
రుణంలో సారూప్యతలతోపాటు తేడాలు
ఇల్లు, ఇండ్ల స్థలం కొనుగోలు కోసం చేసే రెండు రకాల రుణాల మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయి. హోంలోన్ల మాదిరిగానే ల్యాండ్ లోన్లకు కూడా నిబంధనలు, వడ్డీరేటు, ప్రాసెసింగ్ ఒకేలా ఉంటాయి. కానీ అంతర్గతంగా కొన్ని తేడాలు కూడా ఇమిడి ఉన్నాయి. అవేంటో చూద్దాం..
ఇండ్లకు తేలిగ్గా రుణాలు.. కానీ
సిద్ధమైన ఇండ్లు, నిర్మాణంలో ఉన్న ఇండ్లు, స్వంతంగా నిర్మించే ఇండ్లకు హోం లోన్లు లభిస్తాయి. నివాసం నిర్మాణ ప్రాతిపదికన ఇండ్ల స్థలం కొనుగోలు చేసేవారికి ల్యాండ్ లోన్లు తీసుకొవచ్చు.
లొకేషన్, టైప్‌ను బట్టి ల్యాండ్ లోన్లు
సంబంధిత ఇండ్ల స్థలం స్టేటస్, వాటి టైప్, లొకేషన్‌ను బట్టి ఇండ్ల స్థలాల రుణాలు పొందడానికి అర్హత కలిగి ఉంటాయి. హోంలోన్లు మాత్రం పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆఫర్ చేస్తుంటాయని బేసిక్ హోంలోన్ సీఈవో కం సహ వ్యవస్థాపకుడు అతుల్ మొంగా తెలిపారు.
ల్యాండ్ లోన్లపై గరిష్ఠ పరిమితి ఇలా
మీరు తీసుకునే ఆస్తిని బట్టి లోన్ టూ వాల్యూ (ఎల్టీవీ) లేదా లిక్విడిటీ కవరేజీ నిష్పత్తి (ఎల్‌సీఆర్) ఆధారంగా ఇల్లు లేదా ల్యాండ్ లోన్ లభిస్తుంది. ఇండ్ల రుణాలు తీసుకునేవారికి ఆ ఇంటి విలువపై 75-90 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. ఇండ్ల స్థలంపై రుణాలను మాత్రం గరిష్ఠంగా ఎల్టీవీపై 75-80 శాతానికి పరిమితి విధించారు.
ల్యాండ్ కొంటే 20% డౌన్ పేమెంట్ చేయాలి
మీరు వ్యక్తిగత అవసరాలు లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం ఇండ్ల స్థలం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అయితే.. మొత్తం ప్లాట్ విలువలో కనీసం 20 శాతం డౌన్ పేమెంట్ చేయాలి. ఇండ్ల స్థలాలతో పోలిస్తే ఇండ్ల రుణాలకు రిస్క్ తక్కువ. ఇంటి రుణంపై వడ్డీరేట్లు మిగతా రుణాల కంటే తక్కువ. కానీ ల్యాండ్ లోన్‌పై వడ్డీరేట్లు ఎక్కువే ఉంటాయి.
ఇంటి రుణాలకు రీపేమెంట్‌కు అధిక టెన్యూర్ అంటే దాదాపు 30 ఏండ్ల వరకు చెల్లించొచ్చు. కానీ ల్యాండ్ లోన్ రీపేమెంట్ గడువు అంత ఉండదు.
ఇంటి లోన్ మాదిరి నో టాక్స్ డిడక్షన్
ఇంటి రుణాలు తీసుకున్నవారి రీ పేమెంట్‌ను బట్టి పన్ను మినహాయింపులు ఉంటాయి. కానీ ల్యాండ్ లోన్లకు పన్ను మినహాయింపులు వర్తించవు. సొంతంగా నిర్మించుకున్న ఆస్తిపై తీసుకున్న రుణం వడ్డీ మీద ఆదాయం పన్ను చట్టంలోని 80సీ, 24బీ సెక్షన్ల కింద మినహాయింపులు ఉంటాయి. కానీ ల్యాండ్ కొనుగోలు చేసిన వారికి ఈ మినహాయింపులు వర్తించవు.
ఇవి కూడా చదవండి:
Chanu Saikhom Mirabai | కట్టెలు మోసిన చేతులే సిల్వర్ మెడల్ తీసుకొచ్చాయి
మీరాబాయి చానుకు మంత్రి కేటీఆర్ అభినందన
Tokyo Olympics: తొలి గోల్డ్ మెడల్ చైనా ఖాతాలో.. ఇండియన్ షూటర్లు ఫెయిల్
చరిత్రలో ఈరోజు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన బడ్జెట్ ఇది
మీరాబాయి చాను కోచ్‌కు రూ.10 లక్షల నగదు బహుమతి
గోల్డ్ కోసం చాలా ప్రయత్నించాను కానీ..: మీరాబాయ్ చాను
Tokyo Olympics: హాకీలో ఇండియా బోణీ.. న్యూజిలాండ్‌పై విజయం
Tokyo Olympics : ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్‌కు భారత్
బ్రహ్మాజీతో జాగ్రత్తగా ఉండు.. నాగశౌర్యకు రానా సూచన
తాలిబాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న తజికిస్తాన్..!
శుభవార్త..! తగ్గనున్న ఐదు మెడికల్ డివైజ్‌ల ధరలు
ఒలింపిక్స్‌లో 25 ఏండ్ల తర్వాత ఇండియా సంచలనం..!
కశ్మీరీలు పాక్‌లో చేరడంపై రెఫరెండం : పీఓకే ఎన్నికల్లో ఇమ్రాన్ హామీ
1991 నాటి ఆర్థిక కష్టాలు రానున్నాయి : మన్మోహన్ సింగ్ హెచ్చరిక
సెప్టెంబర్ నుంచి చిన్నారులకు కరోనా టీకాలు : గులేరియా
ఐఏఎస్ అధికారి నివాసంలో సీబీఐ తనిఖీలు
రాజ్ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

