Home Loans without Banks | బ్యాంకుతో పనిలేకుండానే హోంలోన్ కావాలా.. అదీ రూ.50 లక్షల వరకు..
Home Loans without Banks | కస్టమర్లకు తక్కువ వడ్డీపై రూ.50 లక్షల ఇంటి రుణం కోసం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌తో ఐపీపీబీ జత కట్టింది.

Home Loans without Banks | మీరు సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా.. మీరు ఏ సంస్థలోనూ ఉద్యోగి కాకున్నా.. 6.66 శాతానికే రూ.50 లక్షల వరకు ఇంటి రుణం తీసుకోవాలని తలపోస్తున్నారా.. అందుకు మీకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) చేయూతనిచ్చి అండగా నిలుస్తుంది. అందుకోసం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థతో చేతులు కలిపింది. ఈ ప్లాట్‌ఫామ్ నుంచి తమ కస్టమర్లకు హోం లోన్ ఫెసిలిటీ కల్పిస్తామన్నారు ఐపీపీబీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జే వెంకట్రాము.

ఎల్ఐసీ హౌసింగ్‌తో ఇండియన్ పోస్ట్ ఎంవోయూ
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) కు ఇప్పుడు 45 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ఐపీపీబీ కస్టమర్లు తమ ఖాతాలు ఉన్న శాఖల ద్వారా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి రుణం పొందొచ్చు. ఎల్ఐసీతో ఒప్పందం చేసుకున్న దరిమిలా పోస్టాఫీసు ఉద్యోగులు.. హోం లోన్ పొందగోరే వారి కోసం ఎక్కువ టైం పని చేస్తారు.దేశవ్యాప్తంగా బ్యాంకు సేవలకు దూరంగా ఉన్న వారికోసం ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్-ఐపీపీబీ జాయింట్ కృషి చేస్తుంది.

ఐపీపీబీకి 650 శాఖల్లో 2 లక్షల మంది ఉద్యోగులు
దేశవ్యాప్తంగా ఐపీపీబీకి 650 శాఖలు ఉన్నాయి. దాదాపు దేశమంతా బ్రాంచ్‌లు ఉన్న శాఖ తపాలా మాత్రమే 1.36 లక్షల బ్యాంకింగ్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. ఇండియా పోస్ట్‌లో సుమారు రెండు లక్షల మంది (పోస్ట్మెన్లు, డాక్ సేవక్) పని చేస్తున్నారు. వారంతా మైక్రో ఏటీఎం, బయో మెట్రిక్‌లతో ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌తో ఒప్పందం తర్వాత ఇండియా పోస్ట్ ఉద్యోగులంతా ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ రుణాలను తమ ఖాతాదారులకు ఆఫర్ చేయడంలో కీలకం కానున్నారు.

కొటక్ మహీంద్రా తర్వాత ఎల్ఐసీ హౌసింగ్‌లోనే తక్కువ వడ్డీ
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 6.66 శాతం వడ్డీకే ఇంటి రుణం మంజూరవుతుంది. ప్రైవేట్ బ్యాంకర్ కొటక్ మహీంద్రా 6.65 శాతం వడ్డీకి ఇంటి రుణాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం కొటక్ మహీంద్రా తర్వాత తక్కువ వడ్డీకి హోంలోన్ ఇస్తున్న సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ మాత్రమే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
Back pain | సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎక్కువగా వేధిస్తున్న ఈ సమస్యను ఎలా జయించాలి?
Mirnalini Ravi | అందాలతో అదరగొడుతున్న మృణాళిని రవి
హెల్త్ ఇన్సూరెన్స్ క్లైయిమ్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి ? ఎవరిని సంప్రదించాలి
గుడ్డి నిర్ణయాలొద్దు.. నీట్‌ను వాయిదా వేయండి..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

