Home Loan | సొంతిల్లు కొనుక్కుంటారా.. ఐటీ చెల్లించకున్నా వీళ్లకు లోన్ వచ్చేస్తుంది
Homeloan without ITR | ఐటీఆర్ దాఖలు చేయలేని కార్మికులకు, స్వయం ఉపాధిపై జీవిస్తున్న వారు సొంతింటిని కొనుగోలు చేసే వెసులుబాటు అందుబాటులోకి వచ్చిం....

Homeloan without ITR | సొంతింటి కల సాకారం చేసుకోవాలని ప్రతి భారతీయుడి కల.. ప్రస్తుతం తక్కువ వడ్డీరేటుపై బ్యాంకులు ఆకర్షణీయ హోంలోన్లు ఇస్తున్నాయి. కానీ ఆ రుణాలకు దరఖాస్తు చేయాలంటే ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయాలి. ఐటీఆర్ ఫామ్స్ ఉంటే.. వారి ఆదాయాన్ని బట్టి బ్యాంకులు రుణాలిస్తాయి.. కానీ ఐటీఆర్ దాఖలు చేయలేని కార్మికులకు, స్వయం ఉపాధిపై జీవిస్తున్న వారు సొంతింటిని కొనుగోలు చేసే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఐసీఐసీఐ హోం ఫైనాన్స్ ఆ ఫెసిలిటీ కల్పిస్తోంది.
బిగ్ ఫ్రీడం మంత్ ఆఫర్..
తమ ఆదాయ వివరాలు వెల్లడించే ఐటీఆర్ పత్రాలు సమర్పించలేని వారికి ఈ ఫెసిలిటీ కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ హోం ఫైనాన్స్ తెలిపింది. ‘బిగ్ ఫ్రీడం మంత్’ అనే పేరుతో ‘స్పాట్ సరళ్ హౌసింగ్ లోన్’ కింద ఈ రుణ సదుపాయం కలిగిస్తోంది.
కార్పెంటర్లు.. ప్లంబర్లు.. ఆటో డ్రైవర్లకు..
కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, టైలర్లు, ప్లంబర్లు, పెయింటర్లు, ఆటోమెకానిక్స్లు, ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు తదితరులకు బిగ్ ఫ్రీడం మంత్ పేరుతో ఇంటి రుణాలిస్తున్నది ఐసీఐసీఐ హోం ఫైనాన్స్. అయితే హోం లోన్ కావాలని కోరే వారు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఆరు నెలల బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ సమర్పించాల్సి ఉంటుంది.
వీరికి ఐసీఐసీఐ శాఖల సిబ్బంది చేయూత
బిగ్ ఫ్రీడం మంత్‌లో భాగంగా వివిధ రకాల హౌసింగ్ లోన్ ఆఫర్ల కింద ఆన్సైట్ హోం లోన్ అందుబాటులోకి తెస్తున్నట్లు ఐసీఐసీఐ హోం ఫైనాన్స్ ఎండీ కం సీఈవో అనిరుద్ధ్ కమానీ చెప్పారు. కనీస పత్రాలు సమర్పించిన వారికి రుణ పరపతి కల్పించడంలో తమ ఐసీఐసీఐ శాఖల్లోని స్థానిక ప్రతినిధులు చేయూతనిస్తారన్నారు.
పీఎంఏవై కింద రూ.2.67 లక్షల వడ్డీపై సబ్సిడీ
స్పాట్ సరళ్ హౌసింగ్ లోన్ కింద ఇంటి రుణం తీసుకున్న రుణ గ్రహీతలు రుణంపై రూ.2.67 లక్షల వరకు వడ్డీ మీద ప్రధానమంత్రి ఆవాజ్ యోజన (పీఎంఏవై) కింద సబ్సిడీ అందుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడి వర్గాల వారికి, తక్కువ ఆదాయ వర్గాల వారికి స్పాట్ సరళ్ హౌసింగ్ లోన్ ఫెసిలిటీ అందుబాటులోకి తెచ్చినట్లు ఐసీఐసీఐ హోం పైనాన్స్ వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

