ఇంటి రుణ భారం తగ్గించుకోవాలంటే.. ఇవీ ఆప్షన్లు!!
ఇంటి రుణ భారం తగ్గించుకోవాలంటే.. ఇవీ ఆప్షన్లు!!| ఇంటి రుణం భారం తగ్గించుకోవాలనుకుంటున్నారా.. వాయిదాలు పెంచుకోండి.. లేదా షార్ట్‌టర్మ్ లోన్ .....

న్యూఢిల్లీ: సొంతిల్లు కొనుక్కోవడం ప్రతి ఇండియన్ కల. సగటు భారతీయుడి జీవితంలో ఇది అతి పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం. అందువల్లే ఇండియన్లు ఇల్లు కొనుక్కోవడానికి హోంలోన్ తీసుకుంటారు. ఇంటి రుణం తీసుకున్న రుణ గ్రహీత 20 ఏండ్ల వరకు ఆ రుణం చెల్లించాల్సి రావడం క్లిష్టమైన ప్రక్రియ.
రుణ గ్రహీతలపై ఆర్థిక ఒత్తిడి భారం తగ్గుముఖం
ఇటువంటి తరుణంలో కొన్ని చర్యలు తీసుకుంటే, ఇంటి రుణ గ్రహీతలపై ఆర్థిక ఒత్తిడి తగ్గుముఖం పడుతున్నది. వేగవంతంగా చెల్లింపుల ప్రక్రియ చేపట్టడం ఇందులో ఒకటి. ఇంటి రుణ భారం తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలేంటో చూద్దాం..
షార్ట్‌టర్మ్ లోన్‌తోనే బెటర్ ఇలా
రుణ భారం తగ్గించుకోవాలంటే సుదీర్ఘ టెన్యూర్ కంటే షార్ట్ టర్మ్ లోన్ తీసుకుంటే శరవేగంగా ఇంటి రుణం చెల్లింపులకు వీలవుతుందని బేసిక్ హోం లోన్ సీఈవో కం కో ఫౌండర్ అతుల్ మొంగా చెప్పారు.
అదనపు మొత్తం డిపాజిట్ చేస్తే ఇలా..
ఎక్కువ మొత్తంలో రుణ వాయిదా (ఈఎంఐ) చెల్లించడం కంటే ముందే అదనపు మొత్తం బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలి. అప్పుడు వడ్డీ వ్యయం తగ్గుతుంది. సరైన టైంలో రుణం చెల్లించడం బెటర్ ఆప్షన్. త్వరితగతిన ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లించినా వడ్డీ భారం తగ్గించుకోవచ్చు.
తక్కువ వడ్డీపై ఇలా రీఫైనాన్సింగ్
కొన్నిసార్లు షార్ట్ టర్మ్ రుణాల రీ ఫైనాన్సింగ్ ఆకర్షించినా నెలవారీ చెల్లింపులు పెరుగుతాయి. కానీ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. మీరు ఇప్పటికే ఇంటి రుణం తీసుకుంటే, సంబంధిత బ్యాంక్‌తో తక్కువ వడ్డీపై రుణం రీఫైనాన్సింగ్‌కు చర్చలు జరుపాలి. కానీ అందుకున్న అన్ని బ్యాంకులు సిద్ధం కావు.
వడ్డీ భారం ఇలా తగ్గించుకోవచ్చు
ఇంటి రుణ గ్రహీతలకు ఇతర బ్యాంకులు ఆఫర్ చేసే వడ్డీరేట్లు ఆకర్షణీయంగా అంటే తక్కువగా ఉండొచ్చు. అటువంటప్పుడు మిగతా బకాయి రుణం మొత్తాన్ని మరో బ్యాంకుకు బదిలీ చేయడం వల్ల వడ్డీ భారం తగ్గుతుంది.
వడ్డీ భారం తగ్గినా.. ముందు రుణం తీసుకున్న బ్యాంకుకు కొంత నిర్దిష్ట మొత్తం పెనాల్టీ చెల్లించాలి. కొత్త బ్యాంకుకు ప్రాసెసింగ్ ఫీజు కూడా పే చేయాలి.
రుణం బదిలీపై జాగ్రత్తగా నిర్ణయం
మీరు మరో బ్యాంకుకు ఇంటి రుణాన్ని బదిలీ చేయాలని భావిస్తే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వడ్డీరేటు తగ్గించుకోవడానికి ఇంటి రుణాన్ని మరో బ్యాంకుకు బదిలీ చేస్తే.. పెనాల్టీ ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు రూపేణగా ఎక్కువ చెల్లించాలి.
ఇలా త్వరగా ఇంటి రుణం చెల్లింపు
అలా కాక.. షార్ట్ టర్మ్ రుణం తీసుకోవాలని భావిస్తే, బ్యాంకర్ మీకు తక్కువ వడ్డీరేటుపై రుణం ఆఫర్ చేసే వీలుంది. ఇలా చేయడం వల్ల తొందరగా ఇంటి రుణం చెల్లింపులు పూర్తి చేసేయొచ్చు.
రూ.70 లక్షల రుణంపై రూ.60,748 ఈఎంఐ
ఉదాహరణకు మీరు 20 ఏండ్ల టెన్యూర్‌తో రూ.70 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం.. వడ్డీ రేటు 8.5 శాతం ఉంటే నెలవారీ రుణ వాయిదా చెల్లింపులు రూ.60,748 ఉంటుంది.
అసలుతో సమానంగా వడ్డీ చెల్లించాలి
వడ్డీ ప్లస్ అసలు కలిసి మొత్తం రూ.1,45,79,520 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.70 లక్షల ఇంటి రుణం తీసుకుంటే అదనంగా వడ్డీ రూపేణా రూ.76 లక్షల భారం పడుతుంది.
వడ్డీరేటు తగ్గిస్తే వాయిదా తగ్గుముఖం
నాలుగేండ్ల తర్వాత బ్యాంకు వడ్డీరేటు 7.5 శాతానికి తగ్గిస్తే, మీ నెలవారీ రుణ వాయిదా రూ.56,392కు దిగి వస్తుంది. అంటే ప్రతి నెలా మీరు రూ.4,356 వడ్డీ ఆదా చేసినట్లే. 20 ఏండ్లలో సుమారు రూ.10 లక్షలు ఆదా అవుతుంది.
ఈఎంఐ పెంచుకుంటే 12 ఏండ్లకు టెన్యూర్
మీరు నెల వారీ రుణ భారం రూ.68,932కు పెంచుకున్నారనుకోండి. లోన్ టెన్యూర్ 12 ఏండ్లకు తగ్గుతుంది. రుణ వాయిదా రూపేణా ఎక్కువ మొత్తం చెల్లించినా, దీర్ఘకాలంలో రూ.22 లక్షల వరకు పొదుపు చేయొచ్చు.
సిప్ ప్లాన్ కింద ఇలా పెట్టుబడి
దీంతోపాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మీరు తీసుకున్న ఇంటి రుణం రూ.70 లక్షల్లో 0.10 శాతం పెట్టుబడి పెట్టారనుకోండి. అప్పుడు మీరు ప్రతి నెలా రూ.7000 చెల్లించాలి.
ఇలా ప్రిన్సిపల్ అమౌంట్ ఇలా పెంపు
అప్పుడు 20 ఏండ్లలో మీరు రూ.16.80 లక్షలు మదుపు చేసినట్లవుతుంది. మొత్తం పెట్టుబడి రూ.1.04 కోట్లవుతుంది. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం తీసేసుకున్నా ఇంకా రూ.88 లక్షలు మిగిలే ఉంటుంది. ఈ సొమ్ముతో అధిక రుణ వాయిదా చెల్లించి, ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గించుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

