ICICI Results | ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.5,511 కోట్ల నికర లాభం గడించింది. గతేడాది (2020-21) సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.4,251 కోట్ల నికర లాభం సంపాదించింది. ఇక నికర వడ్డీ ఆదాయం 24.8 శాతం పెరిగి రూ.11,690 కోట్లకు చేరుకున్నది. గతేడాది వడ్డీపై నికర ఆదాయం రూ.9,366 కోట్లు లభించింది.
నికర మొండి బకాయిలు 12 శాతం తగ్గాయి. జూన్ త్రైమాసికం ముగిసే నాటికి నికర మొండి బకాయిలు రూ.9,306 కోట్లు ఉన్నాయి. అవి సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.8,161 కోట్లకు పడిపోయాయి. జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ నెలాఖరు నాటికి నికర మొండి బకాయిలు1.16 శాతం నుంచి 0.99 శాతం తగ్గాయి.