న్యూఢిల్లీ, జూలై 27: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.11,059 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. 2023-24 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.9,648.2 కోట్ల లాభంతో పోలిస్తే 14.62 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.38,763 కోట్ల నుంచి రూ.45,998 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు రూ.24,624 కోట్ల నుంచి రూ.29,973 కోట్లకు పెరిగాయి.