IBM Ultimatum | రిమోట్ వర్కింగ్‌పై మేనేజర్లకు ఐబీఎం వార్నింగ్
IBM Ultimatum : ఇప్పటికీ రిమోట్ వర్కింగ్‌లో ఉన్న మేనేజర్లకు ఐబీఎం గట్టి వార్నింగ్ ఇచ్చింది. కంపెనీ సమీపంలో నివసించాలని లేదా సంస్ధ నుంచి వైదొలగాలని అల్టిమేటం జారీ చేసింది.
IBM Ultimatum : ఇప్పటికీ రిమోట్ వర్కింగ్‌లో ఉన్న మేనేజర్లకు ఐబీఎం గట్టి వార్నింగ్ ఇచ్చింది. కంపెనీ సమీపంలో నివసించాలని లేదా సంస్ధ నుంచి వైదొలగాలని అల్టిమేటం జారీ చేసింది. వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయంలో లేదా క్లైంట్ లొకేషన్లో తక్షణమే రిపోర్ట్ చేయాలని అమెరికా కేంద్రంగా కంపెనీలో పనిచేసే మేనేజర్లందరినీ ఐబీఎం హెచ్చరించింది.
వైద్యపరమైన కారణాలతో రిమోట్ వర్క్ మినహాయింపు పొందుతున్న వారు ఆగస్ట్ నాటికి ఐబీఎం కార్యాలయాల సమీపానికి రీలొకేట్ కావాలని కోరింది. ఐబీఎం కార్యాలయాలకు దగ్గరగా చేరుకోని వారు, రిమోట్ అప్రూవ్ కలిగిన ఉద్యోగాల్లో లేని వారు ఐబీఎం నుంచి నిష్క్రమించవచ్చని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ గ్రాంగర్ పేర్కొన్నారు. ముఖాముఖి సంప్రదింపులు, వెసులుబాటు మధ్య సమతూకం పాటించే పని వాతావరణం కల్పించే దిశగా ఐబీఎం దృష్టి సారిస్తుందని కంపెనీ ప్రతినిధి చెప్పారు.
ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయాల్లో పనిచేయాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఇక ఐబీఎం సీఈవో అర్వింద్ కృష్ణ కార్యాలయంలో పనిచేయడం అవసరాన్ని గతంలో పలుమార్లు నొక్కిచెప్పారు. ఆన్ సైట్లో పనిచేయని వారికి పదోన్నతులు దక్కడం అరుదని బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.
Read More :
London Train: లండన్ మెట్రోరైలులో పంచ్‌లు విసురుకున్న ప్యాసింజెర్లు.. వీడియో
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

