Radhika Gupta | లగ్జరీ కారు కొనుక్కునే సామర్థ్యం ఉన్నా ఇప్పటి వరకూ వాటిని కొనుగోలు చేయలేదని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ కం ఎండీ రాధికా గుప్తా చెప్పారు. తనకు బోనస్ వచ్చినప్పుడల్లా ఒక ఫ్యాన్సీ కారు కొనుక్కోవాలని భావిస్తానని, అయితే, కారు విలువ తరిగిపోయే ఆస్తిగా పరిగణిస్తానన్నారు. దాన్ని విక్రయించాలంటే ఆ కారు విలువ 30 శాతం పడిపోతుందని ఓ ఇంటర్వ్యూలో రాధికా గుప్తా చెప్పారు. అలా తాను లగ్జరీ కారు కొనక పోవడానికి గల కారణాలను పాడ్ కాస్ట్ చర్చలో తెలిపారు.
తన జీవితంలో ఎదురైన ఘటన ఆధారంగా గుణపాఠాలు నేర్చుకుంటానన్నారు రాధికా గుప్తా. ఎవరైనా వచ్చి ఇన్నోవా ఎందుకు నడుపుతున్నావంటే తన ఇష్టాన్ని బట్టి తన జీవితం గడుపుతానని, ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతానన్నారు. 18 ఏండ్ల క్రితం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని కాలేజీ నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా మంది తన వద్దకు వచ్చి ఫ్యాన్సీ బ్యాగ్ లేదా అని అడిగితే చాలా బాధ పడ్డానని తెలిపారు.