Hyundai IPO | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ ఇండియా (Hyundai India).. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. హ్యుండాయ్ తన ‘హ్యుండాయ్ ఇండియా’లో 17.5 శాతం వాటా విక్రయించాలని తలపెట్టింది. ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా 2.5 బిలియన్ డాలర్ల నుంచి మూడు బిలియన్ డాలర్ల మేరకు నిధులు సేకరించాలని భావిస్తున్నట్లు హ్యుండాయ్ వర్గాలు తెలిపాయి. ఐపీఓకు అనుమతి కోరుతూ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’కి పత్రాలు సమర్పిస్తామని హ్యుండాయ్ వర్గాలు తెలిపాయి.
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తర్వాతీ స్థానంలో హ్యుండాయ్ మోటార్ నిలిచింది. అయితే ఐపీఓకు వెళ్లే విషయమై స్పందించేందుకు హ్యుండాయ్ మోటార్ నిరాకరించింది. ఐపీఓ ద్వారా కొత్త వాటాలు జారీ చేయడం లేదని, కేవలం తమ మాతృసంస్థ ‘హ్యుండాయ్’ వాటాలు మాత్రమే తగ్గించుకుంటున్నదని హ్యుండాయ్ మోటార్ ఇండియా వర్గాల కథనం.