మ్యూచువల్ ఫండ్స్‌లో హైదరాబాదీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తాజా సర్వే ప్రకారం నగరంలోని మదుపరుల్లో 56 శాతం మంది తమ పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్ వైపే మళ్లిస్తున్నట్టు తేలింది. మిగతా మదుపరుల్లోనూ అధికులు స్టాక్స్, ఐపీవోలపైనే ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. 38 శాతం మంది స్టాక్స్‌పై పెట్టుబడులు పెడుతుండగా, కేవలం 2.32 శాతం మంది ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాగా, మ్యూచువల్ ఫండ్స్‌కు యువత నుంచి ఎక్కువగా ఆదరణ లభిస్తుండటం విశేషం. పెట్టుబడుల వేదిక ‘గ్రో’ ఓ సర్వేను చేపట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా సంస్థకున్న 13.86 లక్షల మదుపరుల్లో 56 శాతం మంది హైదరాబాద్‌వారే. ఇక ‘గ్రో’ ద్వారా పెట్టుబడులు పెడుతున్న మదుపరుల్లో 22.85 శాతం మంది 25-30 ఏండ్ల వయస్కులు. 18-24 ఏండ్ల మదుపరులు హైదరాబాద్‌లోనే 19.24 శాతం మంది ఉన్నట్టు ‘గ్రో’ తెలిపింది. 31-40 ఏండ్లవారు 17.13 శాతం మంది ఉన్నారు. ఇక రాష్ట్రంలోని మదుపరుల్లో 47 శాతం మంది స్టాక్స్‌పై, 45 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్‌పై పెట్టుబడులు పెడుతున్నారు. గత కొన్నేండ్లుగా హైదరాబాద్ నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు పెరుగుతున్నారని, నగర ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న చాలామంది పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నారని, తద్వారా సంపదను సృష్టించుకుంటున్నారని సంస్థ సీఈవో హర్ష్ జైన్ తెలిపారు.