Hyderabad Best in Life science | లైఫ్ సైన్సెస్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లో ప్రపంచంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో నొయిడా, చెన్నై నిలిచాయి. కరోనా మహమ్మారి వేళ భారత్‌లోని ప్రధాన నగరాలు లైఫ్ సైన్సెస్ పరిశోధనలో ప్రపంచంలోనే దేశాన్ని టాప్‌లో నిలిపాయి. టాప్-10 క్లస్టర్లలో ఏడు నగరాలు భారత్‌వే. కరోనా మహమ్మారి నేపథ్యంలో లైఫ్ సైన్సెస్ ఆర్ అండ్డీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఫైనాన్సియల్ టైమ్స్ గ్రూప్ అనుబంధ ఎఫ్‌డీఐ ఇంటెలిజెన్స్ నిర్వహించిన ఈ అధ్యయనంలో టాప్-10 నగరాల్లో మరో భారత్ నగరాలు.. బెంగళూరు, గుర్‌గ్రామ్, పుణె చోటు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో చైనాలోని గ్యాంగ్జౌ నిలవగా.. టాప్-10లో చెంగ్డూకు స్థానం లభించింది. ముంబై, దక్షిణ కొరియా రాజధాని సియోల్ తర్వాతీ ర్యాంకులు పొందాయి.
3000 చదరపు మీటర్ల స్పేస్‌లో 50 మంది పరిశోధకులతో ఏర్పాటైన లైఫ్ సైన్సెస్ ఆర్ అండ్ డీ ల్యాబ్‌ను ప్రామాణికంగా తీసుకున్నారు. లైఫ్ సైన్సెస్ ఆర్ అండ్ డీలో దేశంలోని వివిధ నగరాల్లో ఏర్పాటైన ల్యాబ్స్‌లో ఖర్చు 10 లక్షల మిలియన్ల డాలర్ల లోపే. నొయిడాలో 8,30,653 డాలర్లు, హైదరాబాద్‌లో 9,02,567 డాలర్లు. చైనాలోని క్లస్టర్లలో చేసిన ఖర్చుతో పోలిస్తే భారత్‌లో జరిగిన వ్యయం సగమే. చైనాలోని వుక్సీ నగరంలో 16,26,101 డాలర్లు, సుజౌలో 16,79,679 డాలర్లు ఖర్చు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు లైఫ్ సైన్సెస్ పరిశోధన, అభివృద్ధి ఖర్చులో హాట్స్పాట్లుగా నిలిచాయి. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జిలో 44,84,667 డాలర్లు, అమెరికాలోని బోస్టన్‌లో 75,67,706 డాలర్లు ఖర్చయ్యాయి.
లైఫ్ సైన్సెస్ ఆర్ అండ్ డీ నాణ్యతలో ముంబై టాప్-5లో నిలిస్తే, హైదరాబాద్‌కు 12వ స్థానం దక్కింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ సిటీ టాప్‌లో నిలిచింది. సియోల్ కేంద్రంగా పని చేసిన కోజెన్ బయోటెక్ 2020 ఫిబ్రవరి ప్రారంభంలోనే తొలి కోవిడ్-19 టెస్టింగ్ కిట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. చైనాలోని గ్యాంగ్జౌ, జపాన్ రాజధాని టోక్యో వరుసగా రెండవ, మూడవ స్థానాల్లో నిలిచాయి. ఆసియా దేశాల్లోని క్లస్టర్లతో పోలిస్తే ఈయూ, నార్త్ అమెరికా దేశాలు వెనుకబడ్డాయి. బెస్ట్ లొకేషన్ వభాగంలో ఇస్తాంబుల్ 14వ ర్యాంక్, న్యూయార్క్ 22వ ర్యాంకుకు పరిమితమైంది. ఆసియాలో టోక్యో 18, సింగపూర్ 33వ ర్యాంక్ పొందాయి. దేశాల వారీగా పోలిస్తే చైనా, భారత్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
సికింద్రాబాద్‌లో ఆటోమేటిక్ మెషిన్‌తో పానీపూరి సర్వ్..
Nokia T20 : నోకియా నుంచి అద్భుతమైన ఫీచర్లతో ట్యాబ్.. ధర కూడా తక్కువే
Talk about luck: ఒకటి, రెండు, మూడు సార్లు కాదు.. ఒకేసారి 20 లాటరీ ప్రైజ్‌లు కొట్టాడు
కోహ్లీసేన మైండ్‌సెట్ సరిగాలేదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్