Talk about luck: ఒకటి, రెండు, మూడు సార్లు కాదు.. ఒకేసారి 20 లాటరీ ప్రైజ్‌లు కొట్టాడు
Talk about luck : వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తికి తాజాగా అదృష్టం భలే విచిత్రంగా కలిసొచ్చింది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు కాదు… ఏకంగా 20 సార్లు లాటరీ గెలిచి ..

(Talk about luck) లాటరీ అనేది అదృష్టంతో ముడిపడి ఉంటుంది. టిక్కెట్లు కొన్న అందరూ లాటరీ బహుమతి గెలుచుకోలేరు. వేల మంది టిక్కెట్లు కొంటే.. పది మందికో, ఇరవై మందికో బహుమతులు వస్తుంటాయి. కొందరు ఉబుసుపోక టిక్కెట్లు కొని లక్షల జాక్‌పాట్ కొట్టేయగా, మరికొందరేమో ఎప్పటికైనా అదృష్ట దేవత తలుపు తట్టకపోతుందా అనే ఆశతో టిక్కెట్లు కొంటుంటారు. అయితే, వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తికి తాజాగా అదృష్టం భలే విచిత్రంగా కలిసొచ్చింది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు కాదు… ఏకంగా 20 సార్లు లాటరీ గెలిచి లక్షాధికారిగా మారాడు.
అలెగ్జాండ్రియాకు చెందిన విలియం నెవెల్ వర్జీనియా లాటరీకి చెందిన ఒకే నంబర్‌తో ఉన్న 20 టిక్కెట్లను కొనుగోలు చేశాడు. తీరా ఫలితం వెలువడగా, మొత్తం 20 టిక్కెట్లు బహుమతి గెలుచుకున్నాయి. గెల్చుకున్న మొత్తం 100,000 డాలర్ల (రూ.74 లక్షలు) వరకు ఉండటం విశేషం. నెవెల్ సాధారణంగా తన ఇంటికి సమీపంలోని దుకాణం నుంచి లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేస్తుంటాడు. అయితే, ఈసారి మాత్రం అతను తొలిసారిగా అక్టోబర్ 23 న మొత్తం 20 టిక్కెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. నెవెల్ 5-4-1-1 సంఖ్యలను ఎంచుకున్నాడు. ఫలితం వెలువడిన తర్వాత ఒక్కో టిక్కెట్‌కి 5,000 డాలర్ల బహుమతి గెలుచుకున్నాడు.
ఏడాది క్రితం వర్జీనియాకు చెందిన మరో వ్యక్తికి కూడా ఇలాంటి అనుభూతే జరిగింది. రేమండ్ హారింగ్టన్ 25 లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసి అన్నింటిపై బహుమతులు గెలిచి మొత్తం 1,25,000 డాలర్లు సొంతం చేసుకున్నాడు. ఓ వ్యక్తి 30 ఏండ్లుగా ఒకే నంబర్ టిక్కెట్లను తీసుకొనే అదృష్టం పరీక్షించుకునేవాడు. ఒక రోజు రెండుసార్లు 1 మిలియన్ డాలర్ల బహుమతిని గెలుచుకుని ఆశ్చర్యపరిచాడు. కొలరాడోలోని ప్యూబ్లోకు చెందిన జో బీ అనే వ్యక్తి మార్చి 25న రెండు పవర్‌బాల్ బహుమతులను గెలుచుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం
ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఎల్లుండి నుంచి నామినేషన్లు
వైద్యరంగంలో మానవ వనరుల కొరతను అధిగమిద్దాం: వెంకయ్యనాయుడు
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

