న్యూఢిల్లీ, నవంబర్ 19: గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల అడ్డాగా హైదరాబాద్ మారిపోయింది. దేశీయ, అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు తమ వ్యాపారాన్ని విస్తరించేక్రమంలో తమ జీసీసీ సెంటర్లను ఆకర్శించడంలో భాగ్యనగరం ముందువరుసలో నిలిచింది. ప్రస్తుతేడాది జనవరి నుంచి నవంబర్ వరకు దేశవ్యాప్తంగా ఏర్పాటైన మొత్తం జీసీసీల్లో అత్యధికంగా హైదరాబాద్లో ప్రారంభించబడ్డాయి.
గడిచిన కొన్నేండ్లుగా జీసీసీలను అత్యధికంగా ఆకర్షిస్తున్న బెంగళూరును ఈసారికి రెండోస్థానానికి వెనక్కినెట్టి తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నట్టు యూనర్ఐక్యూ విడుదల చేసిన సర్వేలో వెల్లడించింది. జనవరి నుంచి నవంబర్ వరకు దేశవ్యాప్తంగా 85 నుంచి 95 జీసీసీలు ఏర్పాటు కాగా, వీటిలో 46 శాతం జీసీసీలు హైదరాబాద్లో ప్రారంభం కావడం విశేషం. అలాగే బెంగళూరు 33 శాతం వాటాతో రెండో స్థానాన్ని సరిపెట్టుకున్నది. వీటిలో కొత్తగా ఏర్పాటవుతున్నవి 60 కాగా, మిగతావి సంస్థలు తమ వ్యాపార విస్తరణలో భాగంగా జీసీసీలను నెలకొల్పుతున్నాయి.
నగరాలవారీగా జీసీసీల ఏర్పాటు