ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభమైన సమయంలో ఇంట్రాడేలో ఏ దశలోనూ కోలుకోలేదు. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు స్టాక్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. మిశ్రమ కార్పొరేట్ ఫలితాలు, ఫెడ్ వడ్డీరేట్ల పెంపు, ఐరోపా దేశాలకు రష్యా గ్యాస్‌ను నిలిపివేసే అవకాశం ఉందన్న వార్తలు సూచీలు భావితమయ్యాయి. బుధవారం ట్రేడింగ్ ముసిసే సరికి సెన్సెక్స్ 537.22 పాయింట్లు కోల్పోయి 56,819.39 వద్ద ముగిసింది. నిఫ్టీ 162.40 పాయింట్లు కోల్పోయి 17,038.40 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్‌గా నిలిచింది. కంపెనీ షేర్లు 7 శాతానికిపైగా పడిపోయాయి. అలాగే బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, విప్రో, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్ షేర్లు కూడా భారీ నష్టపోయాయి. సెన్సెక్స్ 30లో టాటాస్టీల్, ఏషియన్ పేయింట్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.