Abroad Education | వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌కు సమర్పించారు. భారతీయ విద్యార్థుల్లో అత్యధికులు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళుతున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళుతున్న భారతీయ విద్యార్థులకు నిర్మలా సీతారామన్ పన్నుల్లో రాయితీ కల్పించారు. విదేశీ చెల్లింపుల (Foreign Remittances) మీద టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)ను సవరించారు. సవరించిన టీసీఎస్ ప్రభావం విదేశాల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులపై ఎలా ఉంటుందో తెలుసుకుందామా..!
విదేశీ విద్యాభ్యాసం కోసం గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలు, ధృవీకృత చారిటబుల్ సంస్థల నుంచి తీసుకున్న విద్యా రుణాలకు ఆదాయం పన్ను చట్టంలోని 80ఈ సెక్షన్ వర్తిస్తుంది.
* రూ.7 లక్షల వరకూ విదేశీ చెల్లింపులకు టీసీఎస్ వర్తించదు.
* రూ.7 లక్షలపై చిలుకు విదేశీ చెల్లింపులకు టీసీఎస్ వర్తించదు.
* విద్యాయేతర అవసరాల కోసం / 80ఈ సెక్షన్ కిందకు రాని సంస్థ నుంచి తీసుకున్న విద్యారుణం రూ.7 లక్షలు దాటితే 5 శాతం టీసీఎస్ వర్తిస్తుంది.
* ఆదాయం పన్ను చట్టం 206సీ (ఐజీ) సెక్షన్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో విద్యార్థి రూ. 7 లక్షల వరకూ తీసుకున్న రుణంపై ఆథరైజ్డ్ డీలర్లు తప్పనిసరిగా 0.5శాతం టీసీఎస్ వసూలు చేస్తారు. ఆదాయం పన్ను చట్టంలోని 80ఈ సెక్షన్ కింద విద్యార్థులు తీసుకునే విద్యా రుణం రూ.7 లక్షలు దాటితే 0.5 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.
టీసీఎస్ రేట్ల తగ్గింపుతో విదేశాల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు, వారి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. విదేశీ ఉన్నత విద్యాభ్యాసం సులభతరం అవుతుంది. భారతీయ విద్యార్థుల విద్యాభ్యాసం, వృత్తి నైపుణ్య విభాగాలను బలోపేతం చేయాలని కేంద్ర బడ్జెట్ (2025-26)లో నిర్ధేశించారు.