PF | ప్రైవేట్ రంగ సంస్థలు, కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికుల వేతనం నుంచి కొంత.. సంబంధిత యాజమాన్యాల నుంచి మరికొంత వాటా ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) రూపంలో జమ చేస్తారు. ఇలా జమ చేసే పీఎఫ్ కోసం ఖాతాలు ప్రారంభిస్తారు. ఒక్కోసారి పీఎఫ్ అకౌంట్లలో తలెత్తే సమస్యల పరిష్కారానికి ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సదుపాయం కల్పించింది. ఇంకా ‘ఈపీఎఫ్-ఐ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్` అనే స్పెషల్ ప్లాట్‌ఫామ్ తెచ్చింది. పీఎఫ్ అకౌంట్లలో ఏ సమస్య వచ్చినా సదరు ప్లాట్‌ఫామ్స్‌పై ఫిర్యాదు చేయవచ్చు.. అదెలాగో తెలుసుకుందాం..
https://epfigms.gov.in/లో ఈపీఎఫ్ ఐ-గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోంపేజీ కుడివైపున గల మెనూలో ‘రిజిస్టర్ గ్రీవెన్స్’ ఆప్షన్ ఎంచుకుంటే కొత్త పేజీ తెరుచుకుంటుంది. కొత్త పేజీ తెరిచిన తర్వాత పీఎఫ్ నంబర్, ఈపీఎస్ పెన్షనర్, ఎంప్లాయర్, అదర్స్ అనే నాలుగు ఆప్షన్లు కల్పిస్తాయి. వాటిల్లో పీఎఫ్ మెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ‘యస్’ లేదా ‘నో’ అనే ఆప్షన్లు వస్తాయి. నో ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత యూఏఎన్ అండ్ సెక్యూరిటీ కోడ్ నమోదు చేసి గెట్ డిటైల్స్ ఆప్షన్ మీద క్లిక్‌మనిపించాలి.
అక్కడ మీ పర్సనల్ డేటా లభిస్తుంది. అటుపై గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక పర్సనల్ డిలైట్స్ నింపి, కంప్లయింట్ చేయాల్సిన పీఎఫ్ నంబర్ మీద క్లిక్ చేయాలి. స్క్రీన్ మీద పాపప్ కనిపిస్తుంది. అందులో మీ ఫిర్యాదు ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఫిర్యాదు ఆప్షన్ ఎంచుకున్నాక.. ఆ వివరాలు నమోదు చేసి.. వాటికి అవసరమైన పత్రాలు అటాచ్ చేయాలి. అప్పుడు మీ ఫిర్యాదు రిజిస్టర్ కావడంతోపాటు దాని పరిష్కారానికి15-30 రోజుల టైం పడుతుంది.
అంతే కాదు మీకు ఎదురైన సమస్యపై ఫిర్యాదు చేసిన తర్వాత దాని స్టేటస్ తెలుసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ https://epfigms.gov.in/ ఓపెన్ చేయాలి. హోం పేజీలో వ్యూ స్టేటస్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ మొబైల్ నంబర్, సెక్యూరిటీ కోడ్ నింపిన తర్వాత సబ్మిట్ కొడితే స్టేటస్ కనిపిస్తుంది. సకాలంలో మీ ఫిర్యాదు పరిష్కారం కాకపోతే మళ్లీ రిమైండర్ పంపించవచ్చు.