Honor Magic 6 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor) తన హానర్ మ్యాజిక్ 6 ప్రో (Honor Magic 6 Pro) ఫోన్‌ను ఆగస్టు రెండో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. హానర్ మ్యాజిక్ 6 ఫోన్‌తోపాటు గత జనవరిలో చైనాలో ఆవిష్కరించిన హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్‌ను ఫిబ్రవరిలో సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్ ఆగస్టు రెండో తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆవిష్కరిస్తామని మంగళవారం హానర్ ధృవీకరించింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్, హానర్ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలోనూ ఈ ఫోన్ లభిస్తుంది. బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తోందీ ఫోన్.
హానర్ మ్యాజిక్ 6 ప్రో (Honor Magic 6 Pro) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1280×2880 పిక్సెల్స్) ఎల్టీపీఓ ఓలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. డోల్బీ విజన్ మద్దతుతోపాటు 5000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్ లేదా 16 జీబీ ర్యామ్, 256 / 512 / 1 టిగా బైట్ స్టోరేజీ కెపాసిటీ ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్ 8.0 వర్షన్‌పై పని చేస్తుంది.
హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ తో వస్తుంది. ఇందులో 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా, 50 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 180 మెగా పిక్సెల్ టెలిఫోటో షూటర్ విత్ 2.5ఎక్స్ ఆప్టికల్ జూమ్ అండ్ అప్ టూ 10ఎక్స్ డిజిటల్ జూమ్ సపోర్ట్ ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, సెకండరీ 3డీ డెప్త్ సెన్సర్ కెమెరాలు ఉంటాయి. 80వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.