న్యూఢిల్లీ: తన కస్టమర్లకు మెరుగైన సేవలందించడానికి హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ (హెచ్ఎంఎస్ఐ) మరో ముందడుగు వేసింది. ఆన్లైన్ 360-డిగ్రీస్ వర్చువల్ బిగ్ వింగ్ షోరూమ్ (Honda Virtual Show Room) ను సోమవారం ప్రారంభించింది. ఇందులో 360-డిగ్రీస్ వర్చువల్ ప్రొడక్ట్ డెమో, ఆన్లైన్ డాక్యుమెంటేషన్, డైరెక్ట్ టు హోం డెలివరీ, వర్చువల్ చాట్ సపోర్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో భౌతికంగా సంప్రదింపులు జరుపడానికి బదులు డిజిటల్ కాంటాక్ట్ సర్వీసులపై ఫోకస్ చేసినట్లు హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ తెలిపింది. స్టోర్‌లోనే కొనుగోలు చేసినంత అనుభవం, ప్రొడక్ట్ అండ్ వర్చువల్ స్పేస్, వర్చువల్ చాట్ సపోర్ట్‌పై 360 డిగ్రీల వ్యూతో కస్టమర్‌కు సేవలందించడమే లక్ష్యంగా వర్చువల్ షోరూమ్ ప్రారంభించినట్లు పేర్కొంది.
కస్టమర్ లొకేషన్‌ను బట్టి సమీపంలోని డీలర్షిప్తోపాటు ఫేవరెట్ వెహికల్‌ను ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని హెచ్ఎంఎస్ఐ వెల్లడించింది. కస్టమర్ల భద్రత, సౌలభ్యానికి అనుగుణంగా వారికి తమ ప్రొడక్ట్ సేవలను మరింత దగ్గరకు తీసుకెళ్లడమే లక్ష్యం అని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్‌బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!
క్రెడిట్ కార్డుతో జర జాగ్రత్త
Relief for senior citizens | వృద్ధులకు రిలీఫ్.. నో ఐటీఆర్!