రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు ఐదేండ్ల తర్వాత ఈ ఏడాది నుంచే వడ్డీరేట్ల కోతలకు దిగింది. ఈ క్రమంలోనే గత రెండు ద్రవ్యసమీక్షల్లో అర శాతం (50 బేసిస్ పాయింట్లు) రెపోరేటును దించింది. ప్రస్తుతం రెపో 6 శాతంగా ఉన్నది. రాబోయే ద్రవ్యసమీక్షల్లో మరింతగా తగ్గవచ్చన్న అంచనాలూ గట్టిగానే వినిపిస్తున్నాయి.
దీంతో మళ్లీ గృహ రుణాలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్నది. ఇందుకు తగ్గట్టుగానే ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆకర్షణీయ వడ్డీరేట్లకే హోమ్ లోన్లను మంజూరు చేస్తున్నాయి. అయితే రుణగ్రహీతల సిబిల్ స్కోర్‌పై ఈ వడ్డీరేట్లు ఆధారపడి ఉంటాయి. కెనరా బ్యాంక్ అతి తక్కువగా 7.80 శాతానికే గృహ రుణం ఇస్తున్నది. టాప్-10 బ్యాంకుల్లో వడ్డీరేట్ల వివరాలను ఇక్కడ చూడవచ్చు.
గమనిక: ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ నెల 9నాటికి అమల్లో ఉన్న వడ్డీరేట్ల వివరాలు