Gopichand P Hinduja | హిందుజా గ్రూప్ చైర్మన్ (Hinduja Group Chairman) గోపీచంద్ పి హిందుజా (Gopichand P Hinduja) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 85 ఏండ్లు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లండన్ (London)లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
హిందుజా బ్రదర్స్ మొత్తం నలుగురు. అందులో గోపీచంద్ పి హిందుజా రెండోవాడు. పెద్దవాడైన ఎస్పీ హిందుజా 2023 మేలో కన్నుమూసిన విషయం తెలిసిందే. గోపీచంద్ హిందుజా మృతికి ఆయన సోదరులు ప్రకాశ్ హిందుజా, అశోక్ హిందుజా సంతాపం వ్యక్తం చేశారు.
గోపీచంద్ హిందుజా 1950లో కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టారు. కంపెనీని ఇండో-మిడిల్ ఈస్ట్ ట్రేడింగ్ ఆపరేషన్ నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఎంతో కృషి చేశారు. గోపీచంద్ పి హిందుజాకి బిజినెస్ సర్కిల్లో ‘జీపీ’గా గుర్తింపు ఉంది. హిందుజా గ్రూప్ అనేక రంగాల్లో విస్తరించి ఉంది. ఆటోమోటివ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్, పవర్, మీడియా, వినోదం వంటి 11 రంగాల్లో వ్యాపారాలను కలిగి ఉంది. అందులో అశోక్ లేలాండ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, NXTDIGITAL లిమిటెడ్ ప్రసిద్ధి చెందాయి.
Also Read..
Stock Market | నష్టాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 519 పాయింట్లు డౌన్..!
జెడ్ఈఐఎస్ఎస్ ఎక్సలెన్స్ సెంటర్
ట్రంప్ టారిఫ్‌ల్లో భారత్ టాప్.. మోదీ సర్కారుతో చెడుతున్న దోస్తీ