హైదరాబాద్, నవంబర్ 3: అంతర్జాతీయ ఆప్టికల్ దిగ్గజం జెడ్ఈఐఎస్ఎస్..తాజాగా హైదరాబాద్‌లో మరో ఎక్సలెన్స్ సెంటర్‌ను ప్రారంభించింది 4.500 చదపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ సెంటర్‌తో నూతన పరిశోధనలు గావించడానికి వినియోగించనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆటోమేషన్, ఇండస్ట్రీ 4.0 ఒకదానికొకటి ముడిపడివున్నాయి..హైదరాబాద్‌లో ఏరోస్పేస్ రంగం వేగవంతంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, అలాగే మెడికల్ పరికరాల తయారీ హబ్‌గా మారిందని చెప్పారు.
మరో సంస్థతో సింగరేణి జట్టు
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ మరో జాతీయ పరిశోధన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అరుదైన మూలకాలను(రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) అన్వేషించడానికి జవహార్ లాల్ నెహ్రు అల్యూమినియం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్‌తో జట్టుకట్టింది. ఇందుకు సంబంధించి సోమవారం సంస్థ సీఎండీ బలరామ్ సమక్షంలో సంస్థ డైరెక్టర్ కే వెంకటేశ్వర్లు, పరిశోధనా సంస్థ డాక్టర్ అనుపర్ అగ్నిహోత్రిలు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు.