శుక్రవారం 30 అక్టోబర్ 2020
Business - Sep 26, 2020 , 00:42:14

హెటిరో ఫావిపిరవిర్‌ రూ.2,640

హెటిరో ఫావిపిరవిర్‌ రూ.2,640

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ హెటిరో.. మార్కెట్లోకి జనరిక్‌ ఓరల్‌ యాంటీవైరల్‌ డ్రగ్‌ ‘ఫావివీర్‌ 800/200’ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తేలిక, మధ్యస్థాయి కరోనా వైరస్‌ సోకిన రోగులకు చికిత్స చేయడానికి ఈ మందును వినియోగిస్తున్నారు. ఫావివీర్‌ 800/200 యాంటివైరల్‌ డ్రగ్‌ ప్యాక్‌లో 800 ఎంజీ టాబ్లెట్లు 16, మరో రెండు 200 ఎంజీ ట్యాబ్లెట్లు ఉంటాయి. ఈ ప్యాక్‌ ధరను రూ.2,640గా నిర్ణయించినట్లు హెటిరో సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలలో వెల్లడించింది.