Summer Holidays | బడులకు రేపే ఆఖరు.. జూన్ 12న రీ ఓపెన్
బడిపిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చేశా యి. ఒక్కరోజు బడికెళితే చాలు 49 రోజులు సెలవులే. 2024 -25 విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరింది.
- 24 నుంచి వేసవి సెలవులు..
Summer Holidays | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): బడిపిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చేశా యి. ఒక్కరోజు బడికెళితే చాలు 49 రోజులు సెలవులే. 2024 -25 విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరింది. మంగళవారమే బడులకు ఆఖరి పనిదినం. సోమవారంతో సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలు ముగియనున్నా యి. మంగళవారం బడుల్లో పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించి, ఆన్లైన్ ప్రోగ్రెస్‌కార్డులు ఇస్తారు. ఇక బుధవారం నుంచి జూన్ 11 వరకు బడులకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. జూన్ 12న బడులు తిరిగి తెరుచుకుంటాయి.
ఈ విద్యా సంవత్సరంలో అల్పాహారానికి శ్రీకారం
రాష్ట్రంలోని సర్కారు బడుల్లోని విద్యార్థుల ఆకలి తీర్చే ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పథకానికి గత కేసీఆర్ సర్కారు ఈ విద్యాసంవత్సరంలోనే శ్రీకారం చుట్టింది. దాదాపు 27,147 పాఠశాలల్లోని 23 లక్షల విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా ఈ పథకానికి అంకురార్పణ చేసింది. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నది. దశల వారీగా రాష్ట్రంలోని 3,500 స్కూళ్లల్లో ఈ పథకాన్ని విస్తరించారు. ఈ పథకం అమలుతో బడుల్లో హాజరు శాతం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ పథకాన్ని ప్రస్తుతం రేవంత్‌రెడ్డి సర్కారు అటకెక్కించింది.
మౌలిక వసతుల కల్పనపై ఫోకస్
ఈ వేసవి సెలవుల్లో రాష్ట్రంలోని బడుల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకో సం రూ. 1100కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నది. పనులను పూర్తి చేసి, జూన్ 5 కల్లా బడులను సిద్ధం చేయాలని గడువు విధించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

