Hero Moto Corp | మీరు హీరో మోటారు సైకిల్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. ? అయితే ఎందుకు ఆలస్యం. ఈ వారంలోపు మీకు నచ్చిన బైక్ లేదా స్కూటర్ కొనుక్కోండి.. ఎందుకంటే ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) సెలెక్టెడ్ మోటారు సైకిళ్లు, స్కూటర్ల ధరలు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. పెంచిన ధరలు జూలై ఒకటో తేదీనుంచి అమల్లోకి వస్తాయని ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. మోటారు సైకిల్ లేదా స్కూటర్‌పై రూ.1,500 చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది. స్పెసిఫిక్ మోడల్ బైక్ లేదా స్కూటర్‌ను బట్టి ధర పెరుగుతుంది. ఇన్ పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో పాక్షికంగానైనా బైక్‌లు, స్కూటర్ల ధరలు పెంచక తప్పడం లేదని తెలిపింది.
హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) బ్రాండ్ కింద బెస్ట్ సెల్లింగ్ మోటారు సైకిళ్లు – హీరో స్ప్లెండర్ (Hero Splendor), హీరో పాషన్ ప్రో (Hero Passion Pro), హీరో గ్లామర్ (Hero Glamor)తోపాటు అన్ని మోటారు సైకిళ్లు, స్కూటర్లపైనా ధరలు పెరుగుతాయి. ప్రపంచంలోకెల్లా రెండో అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అనే పేరు కలిగి ఉంది హీరో మోటో కార్ప్. గత నెలలో 4.79 లక్షల యూనిట్లు విక్రయించింది. 2023 మేతో పోలిస్తే ఏడు శాతం సేల్స్ తగ్గాయి. గతేడాది 5.08 లక్షల యూనిట్లు విక్రయించగా, 18,673 యూనిట్లు విదేశాలకు ఎగుమతి చేసింది.
హీరో మోటారు సైకిళ్లతోపాటు ప్లీజర్ +, డెస్టినీ వంటి స్కూటర్లు కూడా ఉన్నాయి. ధరల పెంపు వల్ల మోటారు సైకిళ్ల విక్రయాలపై ప్రభావం ఉండబోదని భావిస్తున్నది హీరో మోటో కార్ప్. త్వరలో ఆల్ న్యూ స్కూటర్ ‘హీరో డెస్టిని 125 (Hero Destini 125) స్కూటర్ విత్ 125సీసీ సింగిల్ సిలిండర్ మోటార్ తో మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 9 బీహెచ్పీ విద్యుత్, 10.4 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుందని చెబుతున్నారు.
Samsung Galaxy S24 Ultra | టైటానియం ఎల్లో కలర్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా.. ఇవీ డిటైల్స్..!
SBI | ఈ ఏడాది కొత్తగా 400 శాఖలు ప్రారంభిస్తాం.. తేల్చేసిన ఎస్బీఐ చైర్మన్ ఖరా..!
Citroen C3 Aircross | సిట్రోన్ బంపరాఫర్.. సీ3 ఎయిర్ క్రాస్‌పై రూ.2.62 లక్షల వరకూ డిస్కౌంట్..!