Hero Karizma | న్యూఢిల్లీ, నవంబర్ 9: హీరో మోటోకార్ప్.. స్పోర్ట్ బైకుల పరిమితిని మరింత విస్తరించడానికి మరో మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరిజ్మా 210ను అప్‌గ్రేడ్ చేసి మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 210 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో తయారు చేసిన ఈ బైకు యువతను ఉద్దేశంలో పెట్టుకొని తీర్చిదిద్దింది.
వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న ఈ స్పోర్ట్స్ బైకు ధర రూ.2 లక్షల స్థాయిలో ఉంటుందని అంచనా. ఆరు స్పీడ్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైకు పలు మార్పులు చేసింది.