HDFC Bank on Rs 2000 | నేటి నుంచి రూ.2000 నోట్ల డిపాజిట్.. మార్పిడి.. కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏం చెప్పిందంటే..?!
HDFC Bank on Rs 2000 | మంగళవారం నుంచి తమ బ్యాంకు శాఖల్లో ఖాతాదారులు ఎంత మొత్తమైనా రూ.2000 నోట్లు డిపాజిట్ చేసుకోవచ్చునని హెచ్డీఎఫ్సీ బ్యాంకు తెలిపింది. అయితే ఒక రోజు రూ.20 వేలు మాత్రమే మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
HDFC Bank on Rs 2000 | మంగళవారం నుంచి తమ బ్యాంక్ శాఖల్లో ఖాతాదారులు తమ వద్ద ఉన్న రూ.2000కరెన్సీ నోట్లను డిపాజిట్ చేయవచ్చునని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. వారు తమ ఖాతాల్లో రూ.2000 నోట్లు ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయవచ్చునని పేర్కొంది. కానీ, రోజువారీ లిమిల్ ప్రకారం మంగళవారం నుంచి కేవలం రూ.20 వేల విలువైన రూ.2000 నోట్లు మాత్రమే మార్చుకోవచ్చునని స్పష్టం చేసింది.
‘ఆర్బీఐ జారీ చేసిన రూ.2000కరెన్సీ నోటుపై ఎప్పటికప్పుడు మీకు అప్ డేట్ సమాచారం అందజేయాలని భావిస్తున్నాం. కస్టమర్ల విశ్వాసం పొందేందుకు వారికి సౌకర్యవంతమైన సేవలందించడమే మా తొలి ప్రాధాన్యం’ హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తన ఖాతాదారులకు పంపిన ఈ-మెయిల్ సందేశంలో వెల్లడించింది. రూ.2000 కరెన్సీ నోటును మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆయా రూ.2000కరెన్సీ నోట్లను ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడం గానీ, మార్చుకోవడం గానీ చేయొచ్చు. ఈ నేపథ్యంలో ప్రజల్లో సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు వివరణ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులు అనుసరించాల్సిన అంశాలివే..
రూ.2000 నోటు ఇక ముందు కూడా చెల్లుబాటవుతుంది. ఆర్థిక లావాదేవీలకు, చెల్లింపుల స్వీకరణకు దీన్ని అనుమతించవచ్చు.
వచ్చే సెప్టెంబర్ 30 వరకు ఖాతాదారులు తమ శాఖల్లో ఎంత మొత్తంలో రూ.2000 నోట్లు ఎటువంటి అవాంతరాలు లేకుండా స్వేచ్ఛగా డిపాజిట్ చేయొచ్చు.
ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ నిర్దేశిత లిమిట్ మేరకు ప్రతి రోజూ రూ.20 వేల విలువైన నోట్లు మార్చుకోవచ్చు.
ఎస్బీఐ ఇలా నోటిఫికేషన్
అంతకుముందు ఎస్బీఐ కూడా రూ.2000 నోట్ల డిపాజిట్ లేదా మార్పిడిపై ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. రూ.2000 నోట్ల డిపాజిట్లకు ఎటువంటి పత్రం నింపాల్సిన అవసరం లేదు. పాన్ లేదా ఆధార్ కార్డు కూడా చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, డిపాజిట్లు రూ.50 వేలు దాటితే పాన్ కార్డు సమర్పించాలన్న నిబంధన వర్తిస్తుందని ఆర్బీఐ వివరణ ఇచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- hdfc bank
- rbi
- rs.2000
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

