HDFC Bank Q2 Results | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. బ్యాంకు నికర లాభం ఆరు శాతం పెరిగి రూ.15,980 కోట్లకు చేరుకున్నది. 2022-23తో పోలిస్తే బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 6.7 శాతం గ్రోత్తో రూ.27,385 కోట్లకు పెరిగింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్వహణ లాభాలు 30. 5 శాతం వృద్ధితో రూ.27,385 కోట్లకు చేరాయి. నిర్వహణ ఖర్చులు 37.2 శాతం పెరిగి రూ.15,399 కోట్ల వద్దకు చేరుకున్నాయి. నికర ఆదాయం 114 శాతం గ్రోత్ తో రూ.66,317 కోట్ల ఆదాయం లభించింది. స్థూల మొండి బకాయిలు 1.34 శాతం వద్ద నిలకడగా ఉంటే, నికర మొండి బకాయిలు 0.35 శాతానికి పెరిగాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది.
గత జూలై ఒకటో తేదీ నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) విలీనమైంది. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు వెల్లడించడం ఇదే ప్రథమం.