నూఢిల్లీ, ఆగస్టు 22: వచ్చే నెల 3 నుంచి 4 వరకు రెండు రోజులపాటు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కాబోతున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరగనున్న ఈ సమావేశంలోనే జీఎస్టీ స్లాబుల కుదింపుపై చర్చించనున్నారు.