చెన్నై, జూన్ 15: దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ యాంపిర్ నెక్సస్‌ను పరిచయం చేసింది గ్రేవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ. చెన్నై షోరూంలో ఈ స్కూటర్ ధర రూ.1,09,900. ఈ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో కే విజయ కుమార్ మాట్లాడుతూ..30 శాతం అధిక బ్యాటరీ లైఫ్, మరింత పవర్ఫుల్తో తీర్చిదిద్దిన ఈ స్కూటర్ నాలుగు రంగుల్లో లభించనున్నదన్నారు. ప్రస్తుతానికి చెన్నైలో లభించనున్న ఈ స్కూటర్ దశలవారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు.