హైదరాబాద్, జూలై 21: ప్రముఖ ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.180 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభంతో పోలిస్తే 60 శాతం వృద్ధి నమోదైంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం 22 శాతం ఎగబాకి రూ.1,476.8 కోట్లకు చేరుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆశాజనక పనితీరును కనబరిచినట్టు, యూరప్, ఇతర దేశాల్లో కంపెనీ విక్రయాలు అంచనాలకుమించి నమోదు కావడం కలిసొచ్చిందన్నారు.