న్యూఢిల్లీ, జూలై 21: ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.203 కోట్ల రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభంతో పోలిస్తే 182 శాతం వృద్ధి నమోదైందని ప్రకటించింది. అలాగే ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 28 శాతం ఎగబాకి రూ.2,448 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. మరోవైపు, పేటీఎం మనీలోకి రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి తన మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ సిద్ధమవుతున్నది. ఈ లావాదేవీలు సెప్టెంబర్ 30 నాటికి పూర్తికావచ్చునని తెలిపింది.