న్యూఢిల్లీ, జూలై 21: దేశవ్యాప్తంగా డాటా సెంటర్లు హాట్‌కేక్‌ల్లా ఎగరేసుకొని పోతున్నాయి కార్పొరేట్ టెక్నాలజీ దిగ్గజ సంస్థలు. ప్రస్తుత సంవత్సరం తొలి ఆరు నెలల్లో డాటా సెంటర్లు నిర్వహిస్తున్న సంస్థలు అదనంగా తమ సామర్థ్యాన్ని 59 శాతం పెంచుకున్నాయని సర్వే వెల్లడించింది. జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో డాటా సెంటర్ల డిమాండ్ 258 మెగావాట్లకు చేరుకున్నట్టు రియల్ ఎస్టేట్ ఎన్సల్టెన్సీ సావిల్లిస్ ఇండియా తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో డాటా సెంటర్ల సామర్థ్యం 162 మెగావాట్లు ఐటీగా ఉన్నది. దీంతో దేశవ్యాప్తంగా డాటా సెంటర్ల సామర్థ్యం 1.8 గిగావాట్లకు చేరుకున్నది. వీటిలో హైపర్స్కేలర్లు 36 శాతం వాటాను కలిగివుండగా, ఎంటర్‌ప్రైజెస్‌లు 8 శాతం, ఎడ్జ్ డాటా సెంటర్లు ఒక్క శాతం వాటాను కలిగివున్నాయని సావిల్స్ తెలిపింది.
మిగిలిన 55 శాతంలో హైపర్స్కేలర్లు, ఎంటర్‌ప్రైజెస్‌లు రెండింటికి సేవలు అందించే సంస్థలు ఉన్నాయి. దేశీయ డాటాసెంటర్ల రంగం గణనీయమైన విస్తరణకు సిద్ధంగా ఉన్నాయి..2030 నాటికి మొత్తం సామర్థ్యం దాదాపు నాలుగు రెట్టు పెరిగి 7 గిగావాట్లకు చేరుకుంటుందని సావిల్స్ ఇండియా డైరెక్టర్ శ్రీహరి శ్రీనివాసన్ తెలిపారు. దేశీయ డాటా మార్కెట్ నిరంతర వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, ఈ రంగంలోకి భారీగా పెట్టుబడులు పెడుతుండటం, డెవలపర్లు వస్తుండటం ఇందుకు కారణమన్నారు తక్కువ ఖర్చు, ప్రదేశంతో సంబంధం లేని స్వభావం, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కారణాలతో భారత్‌ను ఒక వ్యూహాత్మక గమ్యస్థానంగా మారుతున్నదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు.