న్యూఢిల్లీ, మే 26 : బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకుంటున్నది. ఆఫర్ ఫర్ సేల్ రూట్లో 2 శాతానికి సమానమైన వాటాను బుధవారం నుంచి విక్రయించనున్నట్టు ప్రకటించింది. షేరు ధరల శ్రేణిని రూ.412గా నిర్ణయించింది.
రెండు శాతానికి సమానమైన 12.32 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుండటంతో కేంద్ర సర్కార్‌కు రూ.5 వేల కోట్ల నిధులు సమకూరనున్నాయి. ఈ నెల 27న నాన్-రిటైల్ ఇన్వెస్టర్ల కోసం, 29న రిటైల్ ఇన్వెస్టర్ల కోసం షేర్లను విక్రయించనున్నట్టు దీపం కార్యదర్శి అరుణిష్ చావ్లా తన ఎక్స్‌లో పేర్కొన్నారు.