Pixel Watch 2 | గూగుల్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న పిక్సెల్ వాచ్ 2 (Pixel Watch 2) వచ్చేనెల నాలుగో తేదీన గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. ‘మేడ్ బై గూగుల్’ అనే కార్యక్రమంలో ఆవిష్కరించే పిక్సెల్ వాచ్2.. అక్టోబర్ 5 నుంచి దేశీయ మార్కెట్లోనూ లభిస్తుందని గూగుల్ ఇండియా శనివారం తెలిపింది.
ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో విక్రయిస్తారని గూగుల్ ఇండియా వెల్లడించింది. వీటి ధర ఎంత, స్పెషిఫికేషన్స్ వివరాలను వెల్లడించలేదు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ వీ5 చిప్సెట్తో వస్తున్నది. 24 గంటలకు పైగా బ్యాటరీ లైఫ్ ఉంటుంది. వేర్ ఓఎస్ (Wear OS4)పై పని చేస్తుంది. ఆల్ వేస్ ఆన్ డిస్ ప్లే (ఏఓడీ) ఫీచర్ యాక్టివ్ గా ఉంటుంది.
గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ప్రకారం క్వాల్ కామ్ ఎస్ డబ్ల్యూ5 100 ఎస్వోసీ (స్నాప్ డ్రాగన్ డబ్ల్యూ5 చిప్ సెట్)తో వస్తుందని భావిస్తున్నారు. పిక్సెల్ వాచ్ 2 – నాలుగు ఫ్రెష్ వాచ్ ఫేసెస్తో యాసెసిబుల్, ఆర్క్, బోల్డ్ డిజిటల్, అనలాగ్ బోల్డ్ తో వస్తుందని తెలుస్తున్నది.
పిక్సెల్ వాచ్2తోపాటు పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లు, పిక్సెల్ బడ్స్ ప్రో కూడా ఆవిష్కరిస్తారని ఇంతకుముందే గూగుల్ ప్రకటించింది. అక్టోబర్ ఐదో తేదీ నుంచే ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.