Google Pixel 9 Pro | గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ (Google) తన గూగుల్ పిక్సెల్ 9 ప్రో (Google Pixel 9 Pro) ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం సిద్ధమైంది. వచ్చేనెల 13న జరిగే గూగుల్ ఈవెంట్లో ఈ ఫోన్ ఆవిష్కరిస్తారు. గూగుల్ పిక్సెల్ 8 ప్రో కొనసాగింపుగా గూగుల్ పిక్సెల్ 9 ప్రో (Google Pixel 9 Pro) ఫోన్ వస్తోంది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో (Google Pixel 9 Pro) ఫోన్ ఆఫ్ వైట్ కలర్ ఆప్షన్లో లభిస్తుందని సమాచారం. హారిజొంటల్లీ ఏర్పాటు చేసిన ట్రిపుల్ రేర్ కెమెరా సెన్సర్లతో కూడి రేర్ కెమెరా ఐలాండ్ తో కూడి కెమెరా సెటప్ ఉంటుంది. టెంపరేచర్ సెన్సర్ తోపాటు బ్లాక్ మాడ్యూల్ బయట ఎల్ఈడీ ప్లాష్ యూనిట్, కెమెరా ఐలాండ్ మీద గ్రెయినీ టెక్స్చర్ ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్లో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ సర్వీస్ ‘జెమినీ ఏఐ (Gemini AI)’ కూడా ఉంటుంది. ఏడాది పాటు ఫ్రీ జెమినీ అడ్వాన్స్డ్ (Gemine Advanced) సబ్ స్క్రిప్షన్ కూడా ఇస్తారని వార్తలొచ్చాయి.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.99 వేలు (1099 యూరోలు), 256 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.1.09 లక్షలు (1199 యూరోలు), 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.1.20 లక్షలు (1329 యూరోలు) పలుకుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ హేజెల్ ఒబ్సిడియాన్, పింక్, పోర్సెలియాన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్ లో గూగుల్ అభివృద్ధి చేసిన టెన్సార్ జీ4 ప్రాసెసర్, 25 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4,558 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని తెలుస్తోంది. ఆల్ట్రా వైడ్లో 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 858 సెన్సర్ కెమెరాతోపాటు టెలిఫోటో, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా ఉంటాయని ఉంటాయని సమాచారం. గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్లో వాడిన 50-మెగా పిక్సెల్ శాంసంగ్ జీఎన్కే మెయిన్ సెన్సర్ ఉండొచ్చని తెలిసింది.